జనసేనై కదిలాడు.. జనసేన పార్టీ వీడియో సాంగ్

జనసేనై కదిలాడు.. జనసేన పార్టీ వీడియో సాంగ్

Last Updated : Jan 27, 2019, 10:59 AM IST
జనసేనై కదిలాడు.. జనసేన పార్టీ వీడియో సాంగ్

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి తాను స్థాపించిన జనసేన పార్టీని సిద్ధం చేస్తోన్న ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్ అంతకన్నా ముందుగా తన పార్టీని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీవ్ర కృషి చేస్తున్నారు. వీలు చిక్కినప్పుడల్లా వివిధ ప్రాంతాల్లో పర్యటనలు, యాత్రలు చేస్తూ జనసేన పార్టీని ఓటర్లకు చేరువ చేసే ప్రయత్నం చేస్తోన్న పవన్ కల్యాణ్ తాజాగా తమ పార్టీ యూట్యూబ్ చానెల్ ద్వారా పార్టీ గురించి రూపొందించిన పాటను విడుదల చేశారు. ''ఒక్కడొచ్చాడు వచ్చాడు వచ్చాడు జాతిని జాగృతిగొలుప.. వచ్చాడు వచ్చాడు కులం, మతములతెంప'' అని మొదలయ్యే ఈ పాటను అంజిబాబు అనే గేయ రచయిత రచించగా వరికుప్పల యాదగిరి అనే సింగర్ తానే మ్యూజిక్ కంపోజ్ చేసుకుని పాడారు.

 

Trending News