ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్..మరోక బ్యాడ్ న్యూస్

 ఔట్ సోర్సింగ్ , కాంట్రాక్ ఉద్యోగుల విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది

Last Updated : Jul 3, 2019, 09:39 PM IST
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్..మరోక బ్యాడ్ న్యూస్

అమరావతి: ప్రభుత్వం రంగంలోకి  వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ , కాంట్రాక్ ఉద్యోగులు సర్వీసుల కాలం ముగింపు దశకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఔట్ సోర్సింగ్ గడువు నెల రోజుల పాటు పొడిగిస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది . ప్రభుత్వ సేవలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఆయా సేవలను పొడిగించినట్లు తెలిసింది. తాజా నిర్ణయంతో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఊరట కల్గించినట్లయింది.

ఇదే సందర్భంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మరోక బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తోంది. ఎందుకంటే పైస్థాయి నుంచి  అనుమతి లేకుండా ఎలాంటి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు, కొనసాగింపు కాని వంటివి చేపట్టొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్ చేసే వారికి  తిరిగి అవకాశవస్తుందని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.

Trending News