ఎన్డీయే సర్కాపై అవిశ్వాసం పెట్టేందుకు తాము సిద్ధమన్న జగన్ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ లో ఉన్న ఐదుగురు ఎంపీల్లో ఏ ఒక్క ఎంపీ అయినా అవిశ్వాసం పెట్టినా తన పూర్తి సహకారం ఉంటున్నారు. వైసీపీ అవిశ్వాసం ప్రవేశపెట్టినప్పుడే టీడీపీ అసలు స్వరూపం తెలుస్తోందన్నారు. జగన్ దమ్ము, ధైర్యం ఉన్న నేత.. ఆయన చెప్పినట్లుగా మార్చి5న ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని సవాల్ విసిరారు. జగన్ కనుగా ఆ పనిచేస్తే తనతో పాటు జనసేన నేతలు, కార్యకర్తలు రోడ్లపై వచ్చేందుకు సిద్ధమన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదన్నారు. వాస్తవానికి అవిశ్వాస తీర్మానానికి 50 మంది ఎంపీల మద్దతు అవసరం.. వైసీపీ,టీడీపీ ఎంపీలు కలిస్తే సంఖ్య 25కి చేరుతుంది. అవిశ్వాసం ప్రవేశపెడితే 80 మంది ఎంపీల మద్దతు ఇస్తారని పవన్ జోస్యం చెప్పారు.