తెలంగాణ ఓటర్లను జనసేన చీఫ్ పవన్ కల్యాణ్  సూచన

టీడీపీ విమర్శల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిచారు

Last Updated : Dec 5, 2018, 04:34 PM IST
తెలంగాణ ఓటర్లను జనసేన చీఫ్ పవన్ కల్యాణ్  సూచన

మరో రెండు రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలపై ట్విట్టర్ వేదికగా పవన్ కల్యాణ్ స్పందించారు. తెలంగాణ రాష్ట్రం అన్న..తెలంగాణ ప్రజలు అన్న తనకు ఎనలేని గౌరవం ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తాను తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని త్యాగాలను అర్థం చేసుకున్న వ్యక్తిని పవన్ పేర్కొన్నారు. తెలంగాణ భవిష్యత్తకు సంబంధించిన ఎన్నికలు కాబట్టి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. ఒకవైపు తెలంగాణను ఇచ్చామనేవాళ్లు..మరోవైపు తెలంగాణను తెచ్చామనేవాళ్లు ఇంకో వైపు తెలంగాణను దించామనేవాళ్లు ఇప్పుడు మన ముందు ఉన్నారు. దీంతో తెలంగాణ ప్రజలు వారిలో ఎవరికి ఓటు వేయాలి.. ఎవరికి వేయరాదనే కన్ఫూజన్ లో ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు నేను ఒక్కటే చెప్పదల్చుకున్నా పాలనలో ఎక్కువ పారదర్శకత చూపిస్తూ... అవినీతి రహిత పాలన ఎవరైతే అందిస్తారో లోతుగా ఆలోచించి..ఆత్మసాక్షిగా మీకు నచ్చిన వారికి ఓటు వేయాలని పవన్ కల్యాణ్ సూచించారు.

తెలంగాణలో పోటీ చేయకపోవడానికి కారణం ఇదే..

టీఆర్ఎస్ తో వైసీపీ,జనసేనలో పార్టీలు లోపాయికారీ ఒప్పందం చేసుకున్నాయని టీడీపీ విమర్శల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. టీడీపీలా తాము ఎవరితో రహస్య ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం లేదని.. ఏదైనా బహిరంగంగా ప్రకటించే చేస్తామని పవన్ కల్యాణ్ వెల్లడించారు. తెలంగాణకు ముందస్తు ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో పార్టీ సంస్థగత నిర్మాణానికి సమయం తక్కువగా ఉండటంతో అక్కడ జనసేన పోటీ చేయలేదని వివరణ ఇచ్చారు. టీఆర్ఎస్ తో జనసేన,వైసీపీ పార్టీలు లోపాయికారీ ఒప్పందం చేసుకున్నాయని...టీఆర్ఎస్ నష్టపోకూడదనే ఉద్దేశంతో ఆ పార్టీలు తెలంగాణలో పోటీ చేయడం లేదని టీడీపీ చేసిన ఆరోపణలపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈ మేరకు స్పందించారు.

 

Trending News