Reliance-T Series Movies: చలన చిత్ర పరిశ్రమలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భారీ సినిమాల కోసం రెండు పెద్ద సంస్థలు చేతులు కలుపుతున్నాయి. విభిన్నమైన కథాంశాలతో భారీ, మధ్య తరహా సినిమాల్ని నిర్మించేందుకు వేదిక సిద్ధం చేశాయి.
మూవీ ఇండస్ట్రీ(Movie Industry)క్రమంగా ఎదుగుతోంది. భారీ సంస్థల పెట్టుబడితో సినీ పరిశ్రమ స్థాయి పెరుగుతోంది. చిన్న బడ్జెట్ సినిమాల స్థానంలో భారీ, మధ్య తరహా సినిమాలు పెరుగుతున్నాయి. రెండు బడా సంస్థలు భారీ, మధ్య తరహా సినిమాలు నిర్మించేందుకు చేతులు కలిపాయి. వేయి కోట్ల భారీ వ్యయంతో పదికి పైగా సినిమాలు నిర్మించేందుకు సిద్ధమయ్యాయి. వాస్తవిక అంశాల ఆధారంగా విభిన్న కథాంశాలతో సినిమాలు తెరకెక్కించనున్నాయి.
భారీ బడ్జెట్ సినిమాల(Heavy Budget Movies) క్రేజ్ పెరగడంతో ప్రముఖ మ్యూజిక్ కంపెనీ టీ సిరీస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు కలిశాయి. భారీ, మధ్య తరహా బడ్జెట్ సినిమాలు నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కధ ప్రాధాన్యం కలిగిన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు రిలయన్స్-టీ సిరీస్(Reliance-T Series)సంస్థలు స్పష్టం చేశాయి. రానున్న 2-3 ఏళ్ల కాలంలో సినిమాలు పూర్తవుతాయని తెలిపాయి. పుష్కర్-గాయత్రి, విక్రమ్‌జిత్ సింగ్, మగేశ్ హదవాలే, శ్రీజిత్ ముఖర్జీ, సంకల్ప రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాలు తెరకెక్కనున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ రెండు సంస్థలు కలిసి వందకు పైగా చిత్రాలకు మ్యూజిక్ మార్కెట్(Music Market) చేశాయి. ఇప్పుడు నేరుగా సినిమాలు నిర్మించబోతున్నాయి.
Also read: BiggBoss Telugu Season 5: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 నుంచి సరయూ నామినేషన్‌కు కారణాలివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook