MLA Kapu Ramachandra Reddy Son in Law Death: ప్రభుత్వ విప్, వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథ రెడ్డి (34) అనుమానాస్పద మృతిని పోలీసులు ఆత్మహత్యగా తేల్చారు. పోస్టుమార్టమ్ రిపోర్టులో మంజునాథరెడ్డిది ఆత్మహత్యేనని వెల్లడైంది. వ్యాపారంలో పార్ట్‌నర్‌గా ఉన్న వ్యక్తి మోసగించడం వల్లే మంజునాథరెడ్డి బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆయన తండ్రి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మహేశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్లు 306, 420 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
మంగళగిరి ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టమ్ అనంతరం మంజునాథరెడ్డి మృతదేహాన్ని అన్నమయ్య జిల్లాలోని స్వగ్రామం పప్పిరెడ్డిగారిపల్లెకు తరలించారు. సాయంత్రం 5 గం. సమయంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. అంత్యక్రియల సందర్భంగా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బోరున దు:ఖాన్ని ఆపుకోలేక బోరున ఏడ్చారు. ఎమ్మెల్యే కుమార్తె, మంజునాథరెడ్డి భార్య డా.స్రవంతి కూడా కన్నీరుమున్నీరుగా విలపించింది. స్రవంతి రోదన అక్కడున్నవారిని కంటతడి పెట్టేలా చేసింది.
మంజునాథరెడ్డి ఆత్మహత్యపై ఆయన తండ్రి ఏమన్నారంటే :
మంజునాథరెడ్డి నిర్వహిస్తున్న సహస్ర కంపెనీలో తన కుమారుడితో పాటు రాయచోటికి చెందిన సుఖవాసి చక్రధర్ అనే వ్యక్తి భాగస్వామిగా ఉన్నట్లు మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కంపెనీ లావాదేవీల విషయంలో చక్రధర్ మోసపూరితంగా వ్యవహరించినట్లు మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. చక్రధర్ తన కొడుకు వద్ద డబ్బులు తీసుకున్నాడని.. సహస్ర కంపెనీ కాంట్రాక్ట్ పనులకు మంజూరైన బిల్లుల్లో ఒక్క రూపాయి కూడా తన కొడుక్కి ఇవ్వలేదని ఆరోపించారు. మెషినరీకి కూడా డబ్బులు చెల్లించలేదని.. తన కొడుకు వద్ద ఏమీ లేకుండా చేశాడని వాపోయారు. తన కొడుకు ఆత్మహత్యకు అతనే కారణమని ఆరోపించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook