Konaseema: కోనసీమలో మళ్లీ హై టెన్షన్.. వేలాది మంది పోలీసులతో పహారా!

Konaseema:  జిల్లా పేరుపై జరిగిన ఆందోళనలు, అల్లర్లతో వణికిపోయిన కోనసీమలో మళ్లీ హై టెన్షన్ నెలకొంది.పోలీసులు అప్రమత్తమయ్యారు. వందలాది మంది పోలీసులను మోహరించారు.సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలతో పహారా కాస్తున్నారు

Written by - Srisailam | Last Updated : Jun 25, 2022, 07:25 AM IST
  • కోనసీమలో మళ్లీ అలజడి
  • జిల్లాకు అంబేద్కర్ పేరు ఖరారు
  • గత అల్లర్ల దృష్ట్యా పోలీసుల అలర్ట్
 Konaseema: కోనసీమలో మళ్లీ హై టెన్షన్.. వేలాది మంది పోలీసులతో పహారా!

Konaseema: జిల్లా పేరుపై జరిగిన ఆందోళనలు, అల్లర్లతో వణికిపోయిన కోనసీమలో మళ్లీ హై టెన్షన్ నెలకొంది. నెల రోజుల క్రితం అమలాపురం జరిగిన విధ్వంసకాండ ఘటనతో కోనసీమ ప్రాంత ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. ఇప్పుడిప్పుడే అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొంటోంది. తాజాగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోవడంతో కోనసీమలో మళ్లీ అలజడి నెలకొంది. పోలీసులు అప్రమత్తమయ్యారు. వందలాది మంది పోలీసులను మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలతో పహారా కాస్తున్నారు. గత అల్లర్ల దృష్ట్యా సోషల్ మీడియాపైనా నిఘా పెట్టారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా మెసేజ్ లపై ఆరా తీస్తున్నారు. పోలీసుల మోహరింపుతో కోనసీమలో మళ్లీ ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది.

కొనసీనలో మళ్లీ టెన్షన్ నెలకొనడానికి కారణం.. జిల్లా పేరును జగన్ సర్కార్ ఫైనల్ చేయడమే. కోనసీమ జిల్లాకు పేరును రాజ్యాంగ నిర్మాత డా బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఏపీలో జిల్లాల విభజనలో భాగంగా అమలాపురం కేంద్రం కోనసీమ జిల్లా ఏర్పాటైంది. అయితే కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ మే18న ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనల స్వీకరణకు నెల రోజుల గడువు ఇచ్చింది. ఆ గడువు ముగియడంతో  జిల్లా పేరుపై వచ్చిన సూచనలు, సలహాలను క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు జిల్లా కలెక్టర్. దీనిపై  కేబినెట్ సమావేశంలో చర్చించారు. జిల్లా పేరుపై వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పరిగణలోనికి తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును ఖరారు చేస్తూ తుది నిర్ణయం తీసుకుంది. దీనికి ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

గత నెలలో జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడానికి నిరసనగా కోనసీమలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. అమలాపురం లో మే 24న చేపట్టిన నిరనస అదుపు తప్పి హింసాత్మకంగా మారింది. వేలాది మంది నిరసనకారులు దాదాపు నాలుగు గంటల పాటు బీభత్సం స్పష్టించారు. అమలాపురంలో విధ్వంసానికి పాల్పడ్డారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లను తగలబెట్టారు. ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. కొన్ని బస్సులను దగ్ధం చేశారు. పోలీసుల పైన రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనతో అమలాపురం వణికిపోయింది. అతి కష్టం మీద అల్లర్లను అదుపు చేసిన పోలీసులు... రోజుల పాటు అమలాపురంలో కర్ఫ్యూ విధించారు. కోనసీమలో ఏకంగా రెండు వారాల పాటు ఇంటర్ నెట్ సేవలు బంద్ చేశారు. దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తర్వాత క్రమంగా ఆంక్షలు సడలిస్తూ వచ్చారు. అమలాపురంలో జరిగిన అల్లర్లకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 217 మందిని అరెస్ట్ చేశారు. మరో 40 మందిని గుర్తించిన పోలీసులు.. వాళ్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

ఏపీలో తీవ్ర దుమారం రేపిన కోనసీమ జిల్లా పేరు మార్పుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అమలాపురంతో పాటు కోనసీమలో మొత్తం 13 వందల మంది పోలీసులతో  పహారా ఏర్పాటు చేశారు. కోనసీమ కు ఇప్పుడున్న పేరే కొనసాగించాలని, ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా స్టే ఇవ్వాలని హైకోర్టులో పన్నెండు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటి పైన విచారణ జరిపిన హైకోర్టు.. పిటిషనర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్లతో అల్లర్లకు అవకాశం ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేసింది.

Read also: Big Debate With Bharath : ఎర్రబెల్లి హత్యకు కొండా దంపతులు స్కెచ్ వేసింది నిజమేనా ?

Read also:  Pujara-Shami: చతేశ్వర్‌ పుజారాను డకౌట్ చేసి.. సంబరాలు చేసుకున్న మహ్మద్‌ షమీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News