MLA MS Babu: సీఎం జగన్‌పై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. న్యాయం ఎక్కడ జరుగుతోంది..?

MLA MS Babu Comments On CM Jagan: సీఎం జగన్‌పై వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పని తీరు బాగోలేదంటూ దళిత ఎమ్మెల్యేలకే ఎందుకు టికెట్లు ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. కేవలం దళితులు ఉన్న చోటే అభ్యర్థులను మారుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 2, 2024, 08:14 PM IST
MLA MS Babu: సీఎం జగన్‌పై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. న్యాయం ఎక్కడ జరుగుతోంది..?

MLA MS Babu Comments On CM Jagan: ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పై సొంత పార్టీ ఎమ్మెల్యే ధిక్కార స్వరం వినిపించడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి తీరుపై కొందరు పార్టీ ఎమ్మెల్యేల్లో అంతో ఇంతో అసంతృప్తి ఉన్నా.. ఎవరూ బహిరంగంగా ఆయనకు వ్యతిరేకంగా నోరు విప్పలేదు. కానీ పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు చేసిన కామెంట్లపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

వైసీపీలో దళితులకు న్యాయం ఎక్కడ జరుగుతోందంటూ ఆయన ప్రశ్నించారు. నా బీసీ.. నా ఎస్పీ.. ఎస్టీ అంటున్న జగన్‌ దళితుల పట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. పని తీరు బాగోలేదంటూ దళిత ఎమ్మెల్యేలకే ఎందుకు టికెట్లు నిరాకరిస్తున్నారని మండిపడ్డారు. ఓసీ అభ్యర్థులు ఉన్న చోట్ల అభ్యర్ధిని మార్చకుండా.. దళితులు ఉన్న చోటే అభ్యర్థుల్ని మార్చడం వెనుక ఆంతర్యం ఏమిటని నిలదీశారు. దళితుల మీదే ఎందుకు బురద చల్లుతున్నారని ప్రశ్నించారు.

ప్రజల్లో తనపై ఉన్న వ్యతిరేకత ఏంటో చెప్పాలని ముఖ్యమంత్రిని అడిగినా సమాధానం చెప్పలేదని అన్నారు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు. ఐ ప్యాక్ సర్వే చూసి మార్పులు చేయడం ఏంటన్నారు. 2019లో ఐప్యాక్‌తోనే సర్వే చేయించారా అని వైసీపీ పెద్దలను బాబు నిలదీశారు. డబ్బులిస్తే.. ఐప్యాక్‌ వాళ్లు సర్వే ఫలితాలను మారుస్తారంటూ దుయ్యబట్టారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోనే ఎక్కువ మంది దళితులను మారుస్తున్నారని పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఆరోపించారు.

జిల్లాను చెప్పు చేతుల్లో పెట్టుకున్న ఇద్దరు నాయకులే అంతా చేశారనీ.. తానేమీ చేయలేదని సీఎం జగన్‌ను కలిసినట్లు బాబు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దళితుడిని కాబట్టే తనను బలి చేస్తున్నారని సీఎం ముందే ఆక్రోషం వెళ్లగక్కినట్లు తెలుస్తోంది. ఐదేళ్లుగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నాననీ.. తనను టికెట్ ఆశించొద్దని చెప్పడం సరికాదని అన్నారట. అయితే దీనికి సీఎం జగన్‌ మౌనంగా ఉండిపోనియట్లు తెలుస్తోంది.

ఈ సారి చాలా మంది సిట్టింగ్‌లను కాదని కొత్త వారికి టికెట్లు ఇచ్చేందుకు జగన్ సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చాలా వరకు జిల్లాల ఇన్‌ఛార్జ్‌లను మార్చేశారు. దాదాపు 70 మంది సిట్టింగ్‌లకు టికెట్ గల్లంతవుతుందన్న వార్తలు వస్తున్నాయి. దీంతో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి నెలకొన్నట్లు సమాచారం. అయితే పూతలపట్టు ఎమ్మెల్యే బాబు మాత్రమే బయటకొచ్చారు. బహిరంగంగా సీఎంపై విమర్శలు చేశారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఎక్కడికి దారితీస్తుందని చర్చ మొదలైంది.

Also Read: Yatra 2 Movie: యాత్ర-2 టీజర్‌ వచ్చేస్తోంది.. పోస్టర్ రిలీజ్

Also Read: Petrol And Oil Tankers: వాహనదారులకు గుడ్‌న్యూస్.. పెట్రోల్‌, ఆయిల్‌ ట్యాంకర్ల సమ్మె విరమణ  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News