Deep Depression: బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారి..తీవ్ర వాయుగుండంగా బలపడింది. మండు వేసవి మార్చ్ నెలలో వాయుగుండం రావడం ఏకంగా 28 ఏళ్ల తరువాత ఇదే. వేసవిలో ఎందుకీ పరిస్థితి. ఆ వివరాలు చూద్దాం.
ఏపీలో రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారిన నేపధ్యంలో కోస్తాంధ్రలో వర్షాల హెచ్చరిక జారీ అయింది. మండు వేసవిలో వాయుగుండం ఏర్పడటం ఆసక్తిగా మారింది. ఎందుకంటే సాధారణంగా నైరుతి, ఈశాన్య రుతుపవనాల సమయంలో అల్పపీడనం, తుపాన్లు ఏర్పడుతుంటాయి. ఇవి సహజంగానే జూన్ నుంచి డిసెంబర్ వరకూ ఉంటాయి. తిరిగి మళ్లీ ప్రీ మాన్సూన్ సీజన్ సమయంలో అంటే ఏప్రిల్, మే నెలల్లో అప్పుడప్పుడూ ఏర్పడుతుంటాయి. కానీ మార్చ్ నెలలో అల్పపీడనం లేదా వాయుగుండమనేది చాలా అరుదైన విషయంగా వాతావరణ శాఖ చెబుతోంది. అటువంటిదే ఇప్పుడు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడింది.
మార్చ్ 2వ తేదీన ఏర్పడిన వాయుగుండం..24 గంటల వ్యవధిలో బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. గతంలో ఎప్పుడూ ఇలా మార్చ్ నెల ప్రారంభంలో వాయుగుండాలు ఏర్పడిన పరిస్థితి లేదనే అంటున్నారు వాతావరణ శాస్త్రజ్ఞులు. ఇప్పటి వరకూ అంటే ఐఎండీ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం మేరకు..28 ఏళ్ల క్రితం అంటే 1994 మార్చ్ 21వ తేదీన మాత్రమే వాయుగుండం ఏర్పడింది. తిరిగి ఇదే ఏర్పడటం. మార్చ్ నెల ప్రారంభంలోనే ఏర్పడటం ఇదే తొలిసారి. ఇప్పుడు ఏర్పడిన వాయుగుండం చాలా అరుదైనదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
28 ఏళ్ల తరువాత ఎందుకీ వాయుగుండం
సాధారణంగా వేసవి మధ్యలో అంటే ఏప్రిల్ నెల నుంచి సముద్ర ఉపరితస జలాలు వేడెక్కడం ప్రారంభమవుతుంది. ఇదే అల్పపీడనం లేదా వాయుగుండాలకు కారణమవుతుంది. ప్రస్తుతం పసిఫిక్ మహా సముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటున్నాయని సమాచారం. ఇలా జరగడం మంచిదే. నైరుతు రుతుపవనాల సమయంలో మంచి వర్షాలు కురుస్తాయి. మనం తరచూ వింటుండే లానినో ఎఫెక్ట్ అంటే ఇదే. అయితే పసిఫిక్ మహా సముద్రంలో లానినో ఎఫెక్ట్ వల్లనే బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందనేది వాతావరణశాఖ నిపుణుల అంచనా. మార్చ్ నెలలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వర్షాలు ఏ మేరకు ఉంటాయో ఇంకా తెలియకపోయినా..ఇలా వాయుగుండం ఏర్పడటం మాత్రం ఇదే తొలిసారి.
Also read: Tirumala: తిరుమలలో ఘనంగా అనంతళ్వారు 968వ అవతారోత్సవం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Deep Depression: అత్యంత అరుదైన వాయుగుండం, వేసవి ప్రారంభంలో ఇదే తొలిసారి, కారణమేంటి
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అత్యంత అరుదైనదంటున్న వాతావరణ శాఖ
28 ఏళ్ల తరువాత ఇదే..మార్చ్ నెల ప్రారంభంలో ఏర్పడటం ఇదే తొలిసారి
పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన లానినో ప్రభావం కారణం కావచ్చని అంచనా