Ratha Saptami 2024 Celebrations: సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 16వ తేదీన తిరుమలలో రథసప్తమి పర్వదినం నిర్వహించనున్నారు. ఆ రోజు స్వామివారికి ప్రత్యేక సేవలు, పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ఆ పర్వదినం పురస్కరించుకుని ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. పవిత్రమైన మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని రథ సప్తమి లేదా మాఘ సప్తమి అని పిలుస్తారు.
ఈ పరమ పవిత్రమైన రోజున సూర్యదేవుడు జన్మించాడని ప్రతీతి. ఆరోజున సూర్యుడు జన్మించడంతో ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్రసాదించాడని వేదాల ద్వారా తెలుస్తోంది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగనుండడంతో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆ రోజు తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
సేవలు రద్దు
రథ సప్తమి రోజంతా ప్రత్యేక వాహనాల సేవలు ఉండడంతో రోజువారీ ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. రథసప్తమి కారణంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార తదితర సేవలను తిరుమల తిరుపతి రద్దు చేసింది. కానీ సుప్రభాతం, తోమాల, అర్చన సేవలు మాత్రం ఏకాంతంలో నిర్వహిస్తామని టీటీడీ వెల్లడించింది.
రథ సప్తమి రోజు తిరుమలలో జరిగే వాహన సేవల వివరాలు ఇలా ఉన్నాయి.
- ఫిబ్రవరి 16వ తేదీన తెల్లవారుజామున 5.30 నుంచి 8 గంటల వరకు (సూర్యోదయం ఉదయం 6.40 గంటలకు)- సూర్యప్రభ వాహనం
- చిన్నశేష వాహనం: ఉదయం 9 నుంచి 10 గంటల వరకు
- గరుడ వాహనం: ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
- హనుమంత వాహనం: మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు
- చక్రస్నానం: మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు
- కల్పవృక్ష వాహనం: సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు
- సర్వభూపాల వాహనం: సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు
- చంద్రప్రభ వాహనం: రాత్రి 8 నుంచి 9 గంటల వరకు
Also Read: Kumari Aunty: స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీపై కేసు.. ఆందోళనలో ఆమె అభిమానులు
Also Read: Telangana High Court: తెలంగాణలో అనూహ్య మలుపు.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి బ్రేక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి