టీడీపీకి గుడ్‌‌బై చెప్పనున్న రావెల కిషోర్ బాబు ఏ పార్టీలో చేరతారు ?

గతేడాది చివర్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి పదవి కోల్పోయిన టీడీపీ ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు టీడీపీకు గుడ్‌బై చెప్పే యోచనలో వున్నారా ?

Last Updated : Mar 5, 2018, 05:59 PM IST
టీడీపీకి గుడ్‌‌బై చెప్పనున్న రావెల కిషోర్ బాబు ఏ పార్టీలో చేరతారు ?

గతేడాది చివర్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి పదవి కోల్పోయిన టీడీపీ ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు టీడీపీకు గుడ్‌బై చెప్పే యోచనలో వున్నారా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న రావెల కిషోర్ బాబు.. మంత్రి పదవి ఊడిపోయినప్పటి నుంచే పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుంటూ వస్తున్నారని బలమైన ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ఈమధ్య కాలంలో తన నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది అంటూ ఆయన కొంతమంది నేతలపై ఇటీవల చేసిన కామెంట్స్ ప్రస్తుతం పార్టీ వర్గాల్లో చర్చనియాంశమయ్యాయి.

మైనింగ్ మాఫియా పేరుతో రావెల కిషోర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసింది ఇంకెవరిపైనో కాదు.. సొంత పార్టీ నేతలైన టీడీపీ ప్రజా ప్రతినిధులపైనే అని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా 2019 ఎన్నికల్లోగా తెలుగు దేశం పార్టీకి గుడ్‌బై చెప్పి మరో పార్టీ కండువా కప్పుకోవాలనే యోచనలో కిషోర్ బాబు వున్నారనేది తెలుగు తమ్ముళ్ల టాక్. అయితే, రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీకి గుడ్‌బై చెప్పి, ఆయన ఏ పార్టీవైపు అడుగులేస్తారనేదే ప్రస్తుతం క్లారిటీ లేని విషయం. 

Trending News