PVP satire on Chandrababu Naidu : సరిలేరు నీకెవ్వరు.. చంద్రబాబుపై వైసిపి నేత సెటైర్

సరిలేరు నీకెవ్వరు.. ప్రస్తుతం టాలీవుడ్‌ని షేక్ చేస్తోన్న ఫిల్మీ ఫీవర్ ఇది. కానీ ఇదే సినిమా టైటిల్‌ని ఆధారంగా చేసుకుని 'సరిలేరు నీకెవ్వరు' సారు.. అంటూ ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ నేత ఒకరు సెటైర్ వేశారు.

Last Updated : Jan 10, 2020, 07:24 PM IST
PVP satire on Chandrababu Naidu : సరిలేరు నీకెవ్వరు.. చంద్రబాబుపై వైసిపి నేత సెటైర్

అమరావతి: సరిలేరు నీకెవ్వరు.. ప్రస్తుతం టాలీవుడ్‌ని షేక్ చేస్తోన్న ఫిల్మీ ఫీవర్ ఇది. కానీ ఇదే సినిమా టైటిల్‌ని ఆధారంగా చేసుకుని 'సరిలేరు నీకెవ్వరు' సారు.. అంటూ ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ నేత ఒకరు సెటైర్ వేశారు. ఆ నేత ఎవరో కాదు.. సినీ రంగంలో నిర్మాతగా భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కించిన పీవీపీ ప్రొడక్షన్స్ అధినేత పొట్లూరి వరప్రసాద్. అవును మహేష్ బాబుతోనూ బ్రహ్మోత్సవం సినిమా చేసిన పీవీపీ... తాజాగా అదే మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవ్వరు టైటిల్ ను ఉపయోగించుకుని చంద్రబాబుపై సెటైర్ వేశారు. రాజధాని ఏర్పాటు విషయంలో ఏపీ సర్కార్ వైఖరిని నిరసిస్తూ చంద్రబాబు నాయుడు జోలె పట్టుకుని విరాళాలు సేకరిస్తూ నిరసన వ్యక్తంచేసిన నేపథ్యంలో పీవీపీ ఈ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

 

'' ఐదువేల కోట్లు హారతి కర్పూరంలా తగలబెట్టారు. ఇంకా జోలె పట్టుకొని అడుక్కునేలా ప్రతి ఆంధ్రుడిని రోడ్డు మీద పడేశారు. అదే జోలెలో మీ హెరిటేజ్ షేర్స్, జూబ్లీహిల్స్ భవనాలు కూడా దానమిస్తే.. బెజవాడ, వెనిస్ ఏమిటి అంతకుమించిన నగరాన్ని నిర్మిద్దాం. సరిలేరు మీకెవ్వరు సార్'' అంటూ పీవీపీ శుక్రవారం ఓ ట్వీట్ చేశారు.

 

Trending News