Selvamani Arrest Warrant: వైసీపీ ఎమ్మెల్యే రోజా భర్తపై అరెస్టు వారెంట్.. కారణమదేనా?

Selvamani Arrest Warrant: ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ ఎమ్మెల్యే రోజా భర్త, డైరెక్టర్ సెల్వమణిపై చెన్నై కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. పరువునష్టం కేసు విచారణకు కోర్టులో హాజరుకాని నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 6, 2022, 10:20 AM IST
Selvamani Arrest Warrant: వైసీపీ ఎమ్మెల్యే రోజా భర్తపై అరెస్టు వారెంట్.. కారణమదేనా?

Selvamani Arrest Warrant: వైసీపీ ఎమ్మెల్యే రోజా భర్త, దర్శకుడు ఆర్కే సెల్వమణిపై పరువునష్టం కేసు నమోదయ్యింది. అయితే ఈ కేసులో విచారణకు హాజరుకాని నేపథ్యంలో ఆయనపై అరెస్టు వారెంట్ ను జారీ చేస్తూ చెన్నైలోని జార్జిటౌన్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్కే సెల్వమణి ప్రస్తుతం దక్షిణి భారత చలనచిత్ర కార్మిక సంఘాల అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. 

ఏం జరిగిందంటే?

కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే అరుళ్‌ అన్బరసుతో కలిసి దర్శకుడు సెల్వమణి.. 2016లో ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అదే ఇంటర్వ్యూలో ఫైనాన్షియర్ ముకుంద్ చంద్ బోద్రాపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బోద్రాతో తనకు ఏర్పడిన భేదాభిప్రాయలను తెలిపారు. దీంతో కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే అరుళ్‌ అన్బరసుతో పాటు డైరెక్టర్ సెల్వమణిపై జార్జిటౌన్‌ కోర్టులో బోద్రా పరువునష్టం దావా వేశారు. 

అయితే ఈ కేసు కోర్టులో నడుస్తుండగా, బోద్రా మృతిచెందారు. దీంతో ఆ కేసును అతని కుమారుడు గగన్‌ బోద్రా కొనసాగిస్తున్నారు. ఈ కేసు మంగళవారం (ఏప్రిల్ 5) విచారణకు వచ్చింది. అయితే కేసు విచారణ కోసం సెల్వమణి, అరుళ్‌ అన్బరసులు కోర్టుకు హాజరుకాలేదు. అంతేకాకుండా వీరిద్దరి తరఫు న్యాయవాదులు కోర్టుకు రాలేదు. దీంతో సెల్వమణి, అరుళ్ అన్బరసులపై జార్జిటౌన్ కోర్టు న్యాయమూర్తి అరెస్టు వారెంట్ జారీ చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ ఏప్రిల్ 23కు వాయిదా వేశారు. 

Also Read: AP New Districts: 26 కాదు 27.. ఏపీలో మరో జిల్లా విభజనకు జగన్ సర్కార్ సమాలోచన?

Also Read: Pawan Kalyan New Districts: ప్రజాభిప్రాయాన్ని పరిగణించకుండా ఏపీలో జిల్లాల విభజన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News