Kesineni Nani: విజయవాడ తెలుగు దేశం పార్టీ ఎంపీ కేశినేని కుటుంబ వివాదం ముదురుతోంది. సొంత సోదురుడిపైనే ఎంపీ నాని పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా విజయవాడ టీడీపీలో యాక్టివ్ అయ్యారు ఎంపీ సోదరుడు కేశినేని శివనాధ్ అలియాన్ చిన్ని. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ బాబుతో వరుసగా సమావేశమవుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా టీడీపీ నుంచి కేశినాని చిన్ని పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. దీంతో టీడీపీ అధినేతపై గుర్రుగా ఉన్న కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే కేశినేని నానికి సంబంధించి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విజయవాడలో మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు.. కేశినేని నాని బీజేపీలో చేరుతున్నారా అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.భవిష్యత్తులో జరగబోయే అంశాలను ఇప్పుడే చెప్పేస్తామా అన్నారు. దీంతో బీజేపీ హైకమాండ్ తో నాని మాట్లాడుతున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఆయన కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమని చెబుతున్నారు. 2014లో విజయవాడ ఎంపీగా గెలిచినప్పటి నుంచి బీజేపీ అగ్రనేతలతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు కేశినేని. బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ కోసం నితిన్ గడ్కరీని చాలా సార్లు కలిశారు. అంతేకాదు 2018లో బీజేపీని చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించిన సమయంలోనూ కేంద్ర సర్కార్ పెద్దలతో టచ్ లో ఉన్నారు కేశినేని నాని. తాజాగా కేశినేని నాని మాట్లాడుతున్న మాటలు... సోము వీర్రాజు కామెంట్లతో ఆయన బీజేపీ గూటికి చేరడం ఖాయమని తెలుస్తోంది.
బుధవారం ఢిల్లీలో మీడియాతో ఆఫ్ ద రికార్డ్ లో మాట్లాడిన కేశినేని నాని.. చంద్రబాబుతో పాటు టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర లో ఏక్ నాథ్ షిండేలా టీడీపీకి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఉన్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 50, 60 సీట్లు వస్తే ఏక్ నాథ్ షిండే లా సీఎం రమేష్ తో ఆపరేషన్ నిర్వహిస్తారంటూ బాంబ్ పేల్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏపీలో టీడీపీ గెలవడం అసాధ్యమన్నారు కేశినేని నాని. గెలిచే శక్తి, యుక్తి చంద్రబాబుకు లేదన్నారు. ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా మాట్లాడే నేతల మాటలు చంద్రబాబు నమ్మరని.. బ్రోకర్లు, లోఫర్ల మాటలే ఆయన వింటారని కేశినేని నాని అన్నారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవదని, చంద్రబాబుకు అంత శక్తి లేదని కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. టీడీపీకి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయినందునే చంద్రబాబు విషయంలో కేశినేని తీవ్ర వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. తాజాగా సోము వీర్రాజు కూడా సంకేతం ఇవ్వడంతో త్వరలోనే కేశినేని కాషాయ గూటికి చేరడం ఖాయంగా తెలుస్తోంది.
Also read:Telangana Rains Update: తెలంగాణలో మళ్లీ వర్షాలు... ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షం..
Also read:GVL on Polavaram: ఎవరు ఔనన్నా కాదన్నా పోలవరం పూర్తి తధ్యం..జీవీఎల్ కీలక వ్యాఖ్యలు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook