AP Weather Forecast: ఏపీలో రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు, ఈదురు గాలులు

AP Weather Forecast: ఆంధ్రప్రదేశ్‌కు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన జారీ అయింది. రానున్న మూడ్రోజుల్లో రాష్ట్రంలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఏపీలో వాతావరణం ఎక్కడ ఎలా ఉండనుందో తెలుసుకుందాం

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 6, 2024, 03:55 PM IST
AP Weather Forecast: ఏపీలో రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు, ఈదురు గాలులు

AP Weather Forecast: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణాంద్రలో సముద్రమట్టానికి 5-7 కిలోమీటర్ల ఎత్తులో వ్యాపించి ఉంది. మరోవైపు నైరుతి రుతు పవనాలు సైతం బలంగా ఉండటంతో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 

వాతావరణంలో సంభవించిన మార్పులతో ఏపీలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. రానున్న మూడు నాలుగు రోజుల్లో ఏపీలోని ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ తెలిపింది. నైరుతి రుతుపవనాలు బలంగా ఉండటంతో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. అదే సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. ఇక పిడుగులు కూడా పడే ప్రమాదమున్నందున ఆరుబయట, పొలాల్లో, చెట్ల కింద రైతులు, కూలీలు తిరగవద్దని సూచిస్తున్నారు. 

ఉత్తర కోస్తాంధ్రలో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడనుంది. బలమైన ఈదురుగాలులు, ఉరుములు మెరుపులకు అవకాశముంది. ఇక ఎల్లుండి సోమవారం నాడు మోస్తరు వర్షాలు పడవచ్చు. రెండు మూడు చోట్ల భారీ వర్షం పడవచ్చు. 

దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు మెరుపులతో వర్షాలు పడవచ్చు. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశముంది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీయవచ్చు. రేపు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చు. రేపు కూడా ఈదురు గాలులు వీచే ప్రమాదముంది. 

ఇక రాయలసీమలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడవచ్చు. సోమవారం మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే అవకాశముంది. 

Also read: Credit Card Payments: క్రెడిట్ కార్డు హోల్డర్లకు గమనిక, ఇకపై ఫోన్‌పే వంటి యాప్స్ ద్వారా చెల్లింపులు చేయలేరు

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News