ప్యాకేజీ కన్నా ప్రత్యేక హోదానే ముద్దు: జీన్యూస్ పోల్‌లో ప్రజాతీర్పు

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని.. ఆ హోదాకి తీసిపోని విధంగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవలి కాలంలో మరోమారు స్పష్టం చేశారు. 

Last Updated : Mar 19, 2018, 12:10 AM IST
ప్యాకేజీ కన్నా ప్రత్యేక హోదానే ముద్దు: జీన్యూస్ పోల్‌లో ప్రజాతీర్పు

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని.. ఆ హోదాకి తీసిపోని విధంగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవలి కాలంలో మరోమారు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం దేనివైపు మొగ్గుచూపాలని మీరు భావిస్తున్నారు? అన్న అంశంపై జీన్యూస్ పెట్టిన పోల్‌లో 88% ప్రజలు ప్రత్యేక హోదా కావాలని కోరుతున్నట్లు.. అలాగే 12% ప్రజలు ప్యాకేజీ అయినా ఫరవాలేదని ఇదే పోల్‌లో చెప్పడం గమనార్హం. శుక్రవారం నాడు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ టీడీపీ వైఖరి గురించి తన అభిప్రాయాలు పంచుకున్నారు. 

 'ప్రత్యేక హోదాతో సమానమైన ప్యాకేజీ ఇవ్వడానికి మేము సిద్ధమే. ఆ దిశగా అడుగులు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వారి రాకకై ఎదురుచూస్తున్నాము' అన్నారు. "ఒక పరిష్కారాన్ని టేబుల్ పై ఉంచాము. ఆంధ్రప్రదేశ్‌కు వనరులే కావాలో లేక సమస్య చేయాలని కోరుకుంటున్నారో వారే తేల్చుకోవాలి' అని జైట్లీ ప్రెస్ ట్రస్టు ఆఫ్ ఇండియాకి తెలిపారు. 14వ ఆర్థిక కమిషన్‌ను అమలు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించలేమని జైట్లీ పేర్కొన్నారు.

Trending News