AP Exams: కరోనా మహమ్మారి నేపధ్యంలో ఏపీలో పరీక్షల నిర్వహణ ప్రశ్నార్ధకంగా మారింది. తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే పరీక్షల నిర్వహణకు అనుమతిస్తామని దేశ సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.
కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) కారణంగా ఏపీలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. చాలా రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు కాగా..విద్యార్దుల భవిష్యత్ దృష్ట్యా పరీక్షల నిర్వహణకే ఏపీ ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈ తరుణంలో రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్షల నిర్వహణపై ఇప్పటి వరకూ అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించింది.రెండ్రోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
ఒకవేళ పరీక్షలు (Exams) నిర్వహిస్తే విద్యార్ధుల ఆరోగ్య భద్రత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని సుప్రీంకోర్టు(Supreme Court) ప్రశ్నించింది. పరీక్ష హాలులో కేవలం 15-20మందికి మాత్రమే అనుమతిస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు.మరోవైపు ఇద్దరు విద్యార్ధుల మధ్య కనీసం 5 అడుగుల దూరం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. పదవ తరగతి విద్యార్ధులకు గ్రేడ్లు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. దాంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటే పరీక్షలకు అంటే ఇంటర్ పరీక్షలకు అనుమతిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రభుత్వం చెప్పిన అంశాలన్నింటినీ అఫిడవిట్లో పెట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు ఈ విధంగా పరీక్షలు నిర్వహించే క్రమంలో విద్యార్ధుల ప్రాణాలకు ప్రమాదం వస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని(Ap government) బాధ్యుల్ని చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక త్వరలో రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్ ఖరారు కావచ్చు.
Also read: AP Corona Update: ఏపీలో రెట్టింపు సంఖ్యలో కరోనా రికవరీ రేటు, 2 కోట్లు దాటిన కరోనా నిర్ధారణ పరీక్షలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook