Kodali Nani: గుడివాడపై చంద్రబాబు ఖతర్నాక్ స్కెచ్! కొడాలి నాని ఖేల్ ఖతమైనట్టేనా?

Kodali Nani: కొడాలి దెబ్బకు ప్రస్తుతం గుడివాడలో  టీడీపీకి సరైన నాయకులు లేరు. కేడర్ కూడా బలహీనమైంది. ఉన్న కొద్దిమంది నేతలు ఎవరికి వారే అన్నట్లుగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ ఉన్నా యాక్టివ్ గా పని చేయం లేదు.

Written by - Srisailam | Last Updated : Jun 24, 2022, 03:12 PM IST
  • కొడాలి నాని టార్గెట్ గా మాస్టర్ ప్లాన్
  • గుడివాడలో టీడీపీ జిల్లా మహానాడు
  • కొడాలి కోటలో తొడగొట్టబోతున్న చంద్రబాబు
Kodali Nani: గుడివాడపై చంద్రబాబు ఖతర్నాక్ స్కెచ్! కొడాలి నాని ఖేల్ ఖతమైనట్టేనా?

Kodali Nani: కొడాలి నాని.. ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్. టీడీపీ నుంచి రాజకీయ అరంగ్రేటం చేసిన కొడాలి నాని ఎన్టీఆర్ అభిమానిగానే ఎదిగారు. జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడైన కొడాలి.. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యేగా వరుసగా  నాలుగోసారి గెలిచారు  కొడాలి నాని. గుడివాడ అంటే కొడాలి నాని.. కొడాలి నాని అంటే గుడివాడ. అంతలా గుడివాడతో కొడాలికి అనుబంధం ఉంది. గుడివాడ నియోజకవర్గం  కొడాలి నానికి పెట్టన కోట అంటారు. ఎన్టీఆర్ ను ఆదరించి టీడీపీకి కంచుకోటగా నిలిచిన గడివాడలో గత రెండు పర్యాయాలు వైసీపీ జెండా ఎగిరింది. అయితే వైసీపీ జెండా ఎగిరింది అనేకంటే కొడాలి గెలిచారని చెప్పడం కరెక్ట్ అంటుంటారు.

గుడివాడ కింగ్ గా పిలుచుకునే కొడాలి నాని.. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ ను ఎక్కువగా టార్గెట్ చేస్తుంటారు. గతంలో ప్రతిపక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యేవారు. 2019లో మంత్రి అయినా నాని తీరు మాత్రం మారలేదు. మంత్రిగా కూడా చంద్రబాబు, లోకేష్ పై విరుచుకుపడ్డారు కొడాలి నాని. అసెంబ్లీలోనూ ఆటాడుకున్నారు. కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టారంటే.. చంద్రబాబు మనుషులకు షేకయ్యే పరిస్థితులు కన్పించారు. గత మూడేళ్లుగా చంద్రబాబు తిట్టడానికే కొడాలి పరిమితం అయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. అటు టీడీపీ నేతలు కూడా కొడాలిని అదే స్థాయిలో టార్గెట్ చేశారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గానే ఉన్నారు కొడాలి. అయితే తమకు కొరకరాని కొయ్యగా మారిన కొడాలి నానిపై రివేంజ్ తీర్చుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. కొడాలి సొంత గడ్డ నుంచే ఆయనకు చెక్ పెట్టేలా వ్యూహం రచించారట. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంపై ఫోకస్ చేసిన చంద్రబాబు.. కొడాలికి దిమ్మతిరిగేలా ప్లాన్ చేస్తున్నారట.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏడాది పాటు వేడుకలు జరపనున్నారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల కేంద్రంగా పార్టీ బలోపేతానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే జిల్లా స్థాయిలో మహానాడు నిర్వహిస్తున్నారు. ఒంగోలులో జరిగిన మహానాడు సక్సెస్ కావడంతో జిల్లా మహానాడులను అదే స్థాయిలో నిర్వహిస్తున్నారు. గుడివాడపై ఫోకస్ చేసిన చంద్రబాబు.. కృష్ణా జిల్లా మహానాడును గుడివాడలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 29న గుడివాడలో జరగనున్న మహానాడుకు అత్యంత సవాల్ గా తీసుకుంది టీడీపీ. లక్షమందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తోంది. గుడివాడ మహానాడు, బహిరంగసభపై కృష్ణా జిల్లా నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జన సమీకరణ చేయాలని నేతలకు ఆదేశాలు జారీ చేశారు. గుడివాడ బహిరంగ  సభ ఏర్పాట్లు, జనసమీకరణను చంద్రబాబు స్వయంగా మానిటర్ చేస్తున్నారని తెలుస్తోంది. గుడివాడలో తనకు తిరుగులేదని చెప్పుకునే కొడాలి నానికి.. బహిరంగ సభ ద్వారా భయం పుట్టించాలని చంద్రబాబు కసిగా ఉన్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.

కొడాలి దెబ్బకు ప్రస్తుతం గుడివాడలో  టీడీపీకి సరైన నాయకులు లేరు. కేడర్ కూడా బలహీనమైంది. ఉన్న కొద్దిమంది నేతలు ఎవరికి వారే అన్నట్లుగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ ఉన్నా యాక్టివ్ గా పని చేయం లేదు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన కేసినో వ్యవహారంలో టీడీపీ నిజనిర్ధారణ కమిటీ గుడివాడలో పర్యటించినా... ఈ నేతలు స్పందించ లేదు. దీంతో గుడివాడలో బహిరంగ సభ కోసం నేరుగా టీడీపీ అధిష్టానమే డైరెక్ట్ గా రంగంలోకి దిగింది. మాజీమంత్రి కొల్లు రవీంద్రే గుడివాడ బహిరంగ సభ ఏర్పాట్లను చూస్తున్నారు. గుడివాడ టీడీపీ నేతలను ఏకతాటిపై పైకి తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. మహానాడుతో గుడివాడలో తిరిగి టీడీపీకి పునర్ వైభవం వచ్చేలా ప్లాన్ చేశారని చెబుతున్నారు. చంద్రబాబు ఆదేశాలతో అచ్చెన్నాయుడు ఇప్పటికే స్థానిక నేతలతో సమావేశం నిర్వహించారు. జనసమీకరణను చాలెంజ్ గా తీసుకోవాలని పిలుపునిచ్చారు. గుడివాడలో బహిరంగసభకు ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తుందనే భావనలో టీడీపీ నేతలు ఉన్నారు. అందుకే ప్రత్యామ్నాయ మార్గాలను కూడా టీడీపీ హైకమాండ్ సిద్ధం చేసుకుంది. గుడివాడ మహానాడును సక్సెస్ చేసి కొడాలి నాని గుండెల్లో గుబులు పుట్టిస్తామని చెబుతున్నారు కృష్ణా జిల్లా తమ్ముళ్లు.

Read also: Revanth Reddy: కాంగ్రెస్ లోకి జోరుగా వలసలు..రేవంత్ రెడ్డి కమాల్ చేస్తున్నారా! రేస్ లో బీజేపీ వెనకబడిందా?    

Read also: Chandrababu on Police: పోలీసులా..వైసీపీ కార్యకర్తలా..తాము వచ్చాక తాట తీస్తామన్న చంద్రబాబు..!    

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News