Chandrababu: నట సామ్రాట్ ఏఎన్నార్‌కు చంద్రబాబు ఘన నివాళి

ANR Jayanthi | దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు జయంతిని పురస్కరించుకుని సెలబ్రిటీలు ఆయన సేవల్ని గుర్తుచేసుకుంటున్నారు. నట సామ్రాట్ ఏఎన్నార్‌కు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (AP Ex CM Chandrababu) ఘన నివాళి అర్పించారు.

Last Updated : Sep 20, 2020, 03:25 PM IST
  • నేడు దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు జయంతి
  • ఏఎన్నార్ జయంతిని పురస్కరించుకుని చంద్రబాబు ట్వీట్
  • నట సామ్రాట్ ఏఎన్నార్‌ సేవల్ని స్మరించుకుంటున్న టాలీవుడ్
Chandrababu: నట సామ్రాట్ ఏఎన్నార్‌కు చంద్రబాబు ఘన నివాళి

మహానటుడు, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జయంతి నేడు (సెప్టెంబర్ 20న). దివంగత నటుడు ఏఎన్నార్ జయంతి (ANR Jayanthi)ని పురస్కరించుకుని పలు రంగాల సెలబ్రిటీలు ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. దివంగత నటుడు ఏఎన్నార్‌కు నివాళి అర్పించారు. ఆయన సేవల్ని స్మరించుకోవాలని సోషల్ మీడియా ద్వారా స్పందించారు. Actor Arya: కోలీవుడ్ నటుడు ఆర్యకు కోర్టు నోటీసులు

‘తెలుగు సినిమా పరిశ్రమకు రెండు కళ్ళుగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు నిలిచారు. సినిమాల పరంగానే కాదు విశిష్టమైన వ్యక్తిత్వాలు, కృషి, పట్టుదల, క్రమశిక్షణలతో ఆ ఇద్దరు కోట్లాది మందికి ఆదర్శనీయులయ్యారు. స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావుగారి జయంతి సందర్భంగా ఆ మహానటుని కళాసేవను స్మరించుకుందాం’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. Malaika Arora: అభిమానులకు మలైకా అరోరా శుభవార్త

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News