TDP BJP ALLAINCE: త్వరలో బీజేపీ కూటమిలోకి టీడీపీ? మోడీ, షాతో చంద్రబాబు చర్చలు సఫలం! జాతీయ మీడియాలో కథనం

TDP BJP ALLAINCE: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొన్ని రోజులుగా పొత్తుల చుట్టే తిరుగుతున్నాయి. 2014 సీన్ రిపీట్ కాబోతుందని.. టీడీపీ మళ్లీ బీజేపీతో దోస్తీ చేయబోతుందనే ప్రచారం సాగుతోంది. ఏపీలో ప్రస్తుతం బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. దీంతో బీజేపీ,జనసేన, టీడీపీ కలిసే పోటీ చేస్తాయనే చర్చలు సాగుతున్నాయి.

Written by - Srisailam | Last Updated : Aug 28, 2022, 12:47 PM IST
  • మళ్లీ ఎన్డీఏ గూటికి టీడీపీ
  • మోడీతో చంద్రబాబు చర్చలు సఫలం
  • జాతీయ మీడియాలో కథనం
TDP BJP ALLAINCE: త్వరలో బీజేపీ కూటమిలోకి టీడీపీ? మోడీ, షాతో చంద్రబాబు చర్చలు సఫలం! జాతీయ మీడియాలో కథనం

TDP BJP ALLAINCE: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొన్ని రోజులుగా పొత్తుల చుట్టే తిరుగుతున్నాయి. 2014 సీన్ రిపీట్ కాబోతుందని.. టీడీపీ మళ్లీ బీజేపీతో దోస్తీ చేయబోతుందనే ప్రచారం సాగుతోంది. ఏపీలో ప్రస్తుతం బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. దీంతో బీజేపీ,జనసేన, టీడీపీ కలిసే పోటీ చేస్తాయనే చర్చలు సాగుతున్నాయి. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా పొత్తులు ఖాయమనేలా వరుసగా ప్రకటనలు చేస్తున్నారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు కూడా తాము త్యాగాలను సిద్ధమనే సంకేతం ఇచ్చారు. టీడీపీ నేతలైతే పొత్తులు ఖాయమయ్యానే అర్ధం వచ్చేలా మాట్లాడుతున్నారు. ఏపీలో కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారమే నిజం కాబోతోందని తెలుస్తోంది. ఏపీలో రాజకీయాల్లో కీలక పరిణామం జరగబోతోందని.. ఎన్డీఏ కూటమిలోకి తిరిగి తెలుగుదేశం పార్టీ ఎంట్రీ ఇవ్వబోతుందనే ప్రచారం ఢిల్లీలో జోరుగా సాగుతోంది.

ఎన్డీఏ కూటమిలోకి మళ్లీ టీడీపీ చేరబోతుందని ఓ జాతీయ మీడియాలో కథనం వచ్చింది. వచ్చే దసరా లేదా దీపావళి నాటికి బీజేపీ కూటమిలోకి తెలుగుదేశం పార్టీ చేరుతుందన్నది ఆ కథనం సారాంశం. ప్రముఖ ఆంగ్ల పత్రిక  ది ఇండియన్ఎక్స్ ప్రెస్  ఢిల్లీ ఎడిషన్ లో కూమీకపూర్ అనే కాలమిస్ట్ ఈ కథనం రాశారు. కూమీకపూర్ దేశంలోని టాప్ కాలమిస్టుల్లో ఒకరు. దేశంలోని టాప్ పొలిటికల్ లీడర్లతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అత్యంత లోతుగా రాజకీయ విశ్లేషన చేసి అంతర్గత విషయాలు రాసే జర్నలిస్టుగా కూమీకపూర్ కు గుర్తింపు ఉంది. ఆయన అంచనా వేసిన చాలా విషయాలు నిజమయ్యాయని చెబుతారు. బీజేపీ అగ్రనేతలకు కమీకపూర్ చాలా దగ్గరి మనిషి అని పేరుంది. అందుకే కమీకపూర్ రాసిన కథనం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

ఇప్పటికే టీడీపీ, బీజేపీ మధ్య పొత్తుకు సంబంధించి చర్చలు కూడా జరిగాయని కూమీకపూర్ తన కథనంలో చెప్పారు. పొత్తు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీతో టీడీపీ అధినేత చంద్రబాబు పక్ష రోజుల క్రితం మాట్లాడారని చెప్పారు. అమిత్ షాతో నారా లోకేష్ పొత్తుల గురించి మంతనాలు సాగించారని వివరించారు. ఏపీ సీఎం జగన్‌ తో విభేదించి టీడీపీతో జతకట్టేందుకు బీజేపీ ఉవ్విళ్లూరుతోందని తన కథనంలో చెప్పుకొచ్చారు కపూర్. ఏపీలో టీడీపీ నిర్వహించిన తాజా సర్వేలో బీజేపీకి నాలుగు శాతం ఓట్ బ్యాంక్ ఉందని తేలిందన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే తమ బలం పెరుగుతుందని బీజేపీ అంచనా వేస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి పెద్దగా ఫలితం లేకపోయినా.. పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ ఓట్ల శాతాన్ని భారీగా పెంచుతుందని పోల్ సర్వేలు సూచిస్తున్నాయని తెలిపారు.ఈ నేపథ్యంలో మిత్రపక్షాలు వేరయి విచ్ఛిన్నమవుతున్న ఎన్డీయేలో టీడీపీ చేరడంపై పండుగ సీజన్ లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది అని కూమి కపూర్ తన కథనంలో రాశారు  బీజేపీ, టీడీపీ పొత్తు అనేక కోణాల్లో ప్రభావం చూపిస్తుందని కూడా చెప్పారు కూమీకపూర్.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహణ సమావేశం కోసం గత నెల చివరి వారంలో ఢిల్లీకి వెళ్లారు చంద్రబాబు. ఈ సందర్బంగా ప్రధాని మోడీని కలిశారు. ఇద్దరు నేతలు కాసేపు ఏకంతంగా మాట్లాడుకున్నారు. 2019 ఎన్నికల తర్వాత మోడీ, చంద్రబాబు కలుసుకోవడం ఇదే. అందుకే ఇద్దరు నేతల భేటీ జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది. ఈ సమయంలోనే పొత్తుల గురించి ఇద్దరి మధ్య చర్చ జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.  ఇటీవల హైదరాబాద్‍లో పర్యటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావును కలిశారు. జూనియర్ ఎన్టీఆర్ తోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అమిత్ షా సమావేశాలు ఏపీలో రాజకీయ కాక రాజేశాయి. జూనియర్ టీడీపీకి ప్రచారం చేస్తే తాము పొత్తు పెట్టుకుంటామని అమిత్ షా చెప్పారనే వార్తలు వచ్చాయి. మోడీతో చంద్రబాబు భేటీ. అమిత్ షాతో జూనియర్ సమావేశంపై వైసీపీకి కలవరానికి గురైందనే ప్రచారం వచ్చింది. ఇప్పటికే బీజేపీకి టీడీపీ దగ్గరయ్యే అవకాశం ఉందంటూ ఏపీ రాజకీయాల్లో, ఢిల్లీలో విస్తృత చర్చ సాగుతోంది.టీడీపీ గతంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. తెలంగాణ విడిపోయిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కలిసే పోటీ చేసింది.

Read also: Bandi Sanjay: కాళేశ్వరం సందర్శనకు బీజేపీ బృందం.. అవినీతి లెక్క తేల్చేందుకేనా?

Read also: TRS MLA JUMP: బీజేపీలోకి టీఆర్ఎస్ ఎమ్మెల్యే? కేంద్రమంత్రి డీల్.. త్వరలోనే ముహుర్తం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News