ఏపీలో ఎంసెట్ ర్యాంకులు మారనున్నాయ్

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఇంజనీరింగ్ విద్యార్థుల ర్యాంకులు స్వల్పంగా మారనున్నాయి.

Last Updated : May 23, 2018, 09:45 AM IST
ఏపీలో ఎంసెట్ ర్యాంకులు మారనున్నాయ్

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఇంజనీరింగ్ విద్యార్థుల ర్యాంకులు స్వల్పంగా మారనున్నాయి. కొత్తగా పలువురికి ర్యాంకులు ఇవ్వబోతున్నారు. బుధ లేదా గురువారాల్లో రివైజ్డ్‌ ర్యాంకుల జాబితాను విడుదల చేయనున్నారు.

ఈ నెల 2న విడుదల చేసిన ఎంసెట్‌ ఫలితాల్లో ఆంధ్ర, తెలంగాణల్లో కలిపి మొత్తం 1,38,017 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. 1,26,197 మంది అభ్యర్థులకే ర్యాంకులు ఇచ్చారు. ఎంసెట్‌లో అర్హత పొందినప్పటికీ 8,569 మంది ఇంటర్మీడియెట్‌లో పాస్ కాలేదు. అలాగే మరో 3,241 మంది ఇంటర్‌ మార్కులు అందుబాటులో లేవు. ఈ 11,820 మందికి ర్యాంకులు కేటాయించనుండటంతో పాటు రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ లతో తొలిత ప్రకటించిన ర్యాంకుల్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఆయా అభ్యర్థుల ఫలితాలను ఏపీ, తెలంగాణ ఇంటర్‌ బోర్డులు తాజాగా ఎంసెట్‌ కన్వీనర్‌కు పంపాయి. సీబీఎస్ ఈ, ఐసీఎస్ఈ, ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ, ఎన్వోఎస్ఎస్  నుంచి కూడా ఎంసెట్‌ కన్వీనర్‌కు మార్కుల జాబితాలు రావాల్సి ఉంటుంది. అప్పుడు కూడా ఎంసెట్‌ ర్యాంకులు స్వల్పంగా మారనున్నాయి.

కాగా, ఎంసెట్‌-ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ అడ్మిషన్ల కమిటీ తొలిసమావేశం ఈ నెల 28న జరగనుంది. ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ జూన్ 5-6 తేదీల్లో ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

263 మెడికల్‌ పీజీ సీట్లు ఖాళీ!

అమరావతి: మెడికల్‌ పీజీ కౌన్సెలింగ్‌లో కన్వీనర్‌, యాజమాన్య కోటాలో 263 సీట్లు మిగిలిపోయాయి. కన్వీనర్‌ కోటాలో 173, యాజమాన్య కోటాలో 90 సీట్లు భర్తీ కాలేదు. ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ  కన్వీనర్‌ కోటాకు మూడుసార్లు, యాజమాన్య కోటాకు రెండుసార్లు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. మిగిలిపోయే సీట్లకు మరోసారి కౌన్సెలింగ్‌ చేపట్టాలని యోచిస్తున్నారు.

Trending News