రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఐదు రోజులపాటు పొడి వాతావరణమే వుండనుందని వాతావరణ శాఖ ఈ తాజా ప్రకటనలో పేర్కొంది. గడిచిన 24 గంటల్లో కోస్తాంధ్రలో పలు చోట్ల చెదురుముదురు జల్లులు కురిసినప్పటికీ, తెలంగాణలో మాత్రం 9 నుంచి 17 డిగ్రీల సెల్సియస్‌ల కనిష్ట ఉష్ణోగ్రతలతో, పొడి వాతావరణమే నెలకొని వుంది.
వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకారం హైదరాబాద్, ఆదిలాబాద్‌లలో 9 డిగ్రీల సెల్సియస్‌ల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా కర్నూలు జిల్లాలోని నంద్యాలలో 19 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.