Union Budget 2024 Updates: బడ్జెట్ కేటాయింపులపై స్పష్టత, ఆ 15 వేల కోట్లు గ్రాంట్ కాదు, అప్పు

Union Budget 2024 Updates: కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు దక్కిన ప్రాధాన్యతపై అంతా సానుకూల స్పందనే ఎదురైంది. కూటమి ప్రభుత్వం గొప్పగా అభివర్ణించుకుంది. ఇక రాజధాని రూపు రేఖలు మారతాయనే అంచనాలు వేసుకున్నారు. ఈలోగా ఆర్థికమంత్రి చేసిన వ్యాఖ్యలు మళ్లీ సందిగ్ధంలో పడేశాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 24, 2024, 06:20 AM IST
Union Budget 2024 Updates: బడ్జెట్ కేటాయింపులపై స్పష్టత, ఆ 15 వేల కోట్లు గ్రాంట్ కాదు, అప్పు

Union Budget 2024 Updates: ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధికి 15 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించడంతో అందరూ ఆనందపడ్డారు. ఏపీకు తగిన ప్రాధాన్యత దక్కిందని అందరూ భావించారు. కానీ బడ్జెట్ అనంతరం నిర్మలా సీతారామన్ ఆ నిధుల గురించి చేసిన వ్యాఖ్యలు కాస్త ఆలోచనలో పడేశాయి. 

కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధికి 15 వేల కోట్లు కేటాయించడం, పోలవరం త్వరగా పూర్తి చేస్తామని చెప్పడంతో పాటు రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు తగిన నిధులు కేటాయించి చర్యలు తీసుకొంటామనడం, ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు సహకారం అందిస్తామనడం వంటి అంశాలతో బడ్జెట్ లో మంచి ప్రాధాన్యత లభించినందుకు ఆనందపడ్డారు. కానీ బడ్జెట్ అనంతరం నిర్మలా సీతారామన్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఆలోచింపచేస్తున్నాయి. ఏపీకు కేటాయించిన 15 వేల కోట్లపై ఆమె స్పష్టత ఇచ్చారు. అది అప్పుగా ఇస్తున్నారా లేక గ్రాంటా అనేది తేల్చేశారు. 

ఆ 15 వేల కోట్లు అప్పు

ఏపీ రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుల గురించి మీడియా ప్రతినిధి ప్రశ్నించగా ఏపీ పునర్విభజన చట్టంలో రాష్ట్రానిక్ సహాయం అందించాలని ఉందన్నారు. ఇందులో భాగంగా ఏపీకు కేటాయించే 15 వేల కోట్లను ప్రపంచ బ్యాంకు నుంచి అప్పుగా తీసకుంటున్నామని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆ తరువాతే నిధులు విడుదల చేస్తామన్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకునే 15 వేల కోట్ల అప్పును తిరిగి ఎలా చెల్లించాలనేది రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయిస్తామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం వాటాను ఎలా చెల్లించాలనేది చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం తిరిగి చెల్లించగలుగుతుందా లేదా అనేది తరువాత చర్చిస్తామన్నారు. ఏదేమైనా ప్రపంచ బ్యాంకు నుంచి అప్పుగా మాత్రమే తీసుకుంటున్నామన్నారు. రాజధాని లేకుండానే పదేళ్లు గడిచిపోయాయన్నారు. దేశంలో ఒక రాష్ట్రమనేది ఉంటే రాజధాని తప్పకుండా ఉండాలన్నారు. ఈ పరిస్థితికి కారకులు ఎవరనే అంశం జోలికి వెళ్లదల్చుకోలేదన్నారు. రాజధాని నిర్మాణానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. 

Also read: Union Budget 2024 Updates: ఏపీ రాజధాని అభివృద్ధికి 15 వేల కోట్ల కేటాయింపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News