Delhi-Tirupati: ఢిల్లీ నుంచి తిరుపతికి డైరెక్ట్ ఫ్లైట్, స్పైస్‌జెట్ సర్వీసు ప్రారంభించిన కేంద్రమంత్రి సింధియా

Delhi-Tirupati: ఆంధ్రప్రదేశ్ తిరుపతి నుంచి దేశ రాజధాని ఢిల్లీ నగరానికి ఇక నేరుగా విమానయాన సౌకర్యం కలిగింది. స్పైస్‌జెట్ నాన్‌స్టాప్ విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 18, 2021, 03:37 PM IST
  • ఢిల్లీ-తిరుపతి మధ్య ఇక డైరెక్ట్ నాన్‌స్టాప్ ఫ్లైట్ సర్వీసు
  • ఢిల్లీ-తిరుపతి స్పైస్‌జెట్ డైరెక్ట్ ఫ్లైట్ ప్రారంభించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సిందియా
  • 2022 మే నాటికి తిరుపతి రన్‌వే విస్తరణ పూర్తి చేసేందుకు చర్యలు
Delhi-Tirupati: ఢిల్లీ నుంచి తిరుపతికి డైరెక్ట్ ఫ్లైట్, స్పైస్‌జెట్ సర్వీసు ప్రారంభించిన కేంద్రమంత్రి సింధియా

Delhi-Tirupati: ఆంధ్రప్రదేశ్ తిరుపతి నుంచి దేశ రాజధాని ఢిల్లీ నగరానికి ఇక నేరుగా విమానయాన సౌకర్యం కలిగింది. స్పైస్‌జెట్ నాన్‌స్టాప్ విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. 

ఏపీలో విజయవాడ, విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లతో పాటు తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలు కీలకంగా మారాయి. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం కావడంతో తిరుపతికి ప్రాముఖ్యత పెరుగుతోంది. ముఖ్యంగా శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం ఇప్పుడు విమాన సర్వీసులు మెరుగుపడుతున్నాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీ నుంచి తిరుపతికి డైరెక్ట్ ఫ్లైట్ అందుబాటులో వచ్చింది. ఢిల్లీ నుంచి తిరుపతికి తొలిసారిగా స్పైస్‌జెట్ సంస్థ నాన్‌స్టాప్ విమాన సర్వీసును ప్రవేశపెట్టింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా(Jyotiraditya Sindhia)ఢిల్లీ-తిరుపతి స్పైస్‌జెట్ సర్వీసును(Delhi-Tirupati Direct Flight Service)ఇవాళ ప్రారంభించారు. ఆయనతో పాటు సహాయ మంత్రులు జనరల్ వీకే సింగ్, ప్రహ్లాద్ పటేల్, స్పైస్‌జెట్(Spicejet)ఎండీ అజయ్ సింగ్ ఉన్నారు. 

అక్టోబర్ నెలాఖరు వరకూ బుధ, శుక్ర, ఆదివారాల్లో అంటే వారానికి మూడుసార్లు ఈ విమాన సర్వీసులు నడుస్తాయి. అనంతరం అంటే అక్టోబర్ 31 నుంచి వారంలో నాలుగురోజులు ఈ సర్వీసు కొనసాగుతుంది. తిరుపతి విమానాశ్రయం ప్రారంభమై 50 ఏళ్లు నిండిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 2022 మే నాటికి రన్ వే విస్తరణ(Tirupati Airport Runway Extension)పనుల్ని పూర్తి చేసి...వైడ్ బాడీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రాకపోకలకు చర్చలు తీసుకుంటామని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. 

Also read: AIADMK Celebrations: రెండుగా చీలిన పార్టీ కేడర్, తమిళనాట మారుతున్న పరిణామాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News