Swarna palace fire accident: హింట్ ఇస్తే లక్ష రూపాయలు బహుమతి: సీపీ శ్రీనివాసులు

స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం ( Swarna palace fire accident) ఘటన విషయంలో హీరో రామ్ వరుస ట్వీట్స్‌తో వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో అనేక చర్చలకు దారితీసిన ఈ అంశంపై విజయవాడ పోలీసు కమిషనర్ శ్రీనివాసులు ( Viajayawada CP Srinivasulu ) పరోక్షంగా స్పందించారు. 

Last Updated : Aug 20, 2020, 09:47 PM IST
Swarna palace fire accident: హింట్ ఇస్తే లక్ష రూపాయలు బహుమతి: సీపీ శ్రీనివాసులు

విజయవాడ: స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం ( Swarna palace fire accident) ఘటన విషయంలో హీరో రామ్ వరుస ట్వీట్స్‌తో వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో అనేక చర్చలకు దారితీసిన ఈ అంశంపై విజయవాడ పోలీసు కమిషనర్ శ్రీనివాసులు ( Viajayawada CP Srinivasulu ) స్పందిస్తూ.. ''పోలీసులకు ఏ కులం లేదు, ఏ మతం లేదు.. మాకు అందరూ సమానమే'' అని అన్నారు. ఎవరో ఏదో కామెంట్ చేశారని స్పందించాల్సిన అవసరం తమకు లేదని పోలీసు కమిషనర్ అభిప్రాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి ఉంటే అందరూ బతికేవారని అన్నారు. ఎటువంటి జాగ్రత్తలు, నిబంధనలు లేకుండా ఆస్పత్రి నిర్వహించారని ఆరోపించారు. ఇప్పటికే ఈ కేసులో చాలా మందిని విచారించామని చెప్పిన సీపీ.. ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తూ సందేహం ఉన్న అందరికీ నోటీసులు జారీ చేసి విచారిస్తామని, ఎవ్వరినీ విడిచిపెట్టేది లేదని సీపీ స్పష్టంచేశారు. కేసు విచారణకు కొంతమంది ముద్దాయిలు, అనుమానితులు సహకరించడం లేదని సీపీ శ్రీనివాసులు తెలిపారు. Also read this : COVID-19: ఏపీలో 3000 దాటిన కరోనా మృతుల సంఖ్య

స్వర్ణ ప్యాలెస్ హోటల్ ( Swarna Palace hotel ), రమేష్ ఆసుపత్రి ( Ramesh hospital ) యాజమాన్యాల మధ్య ఎటువంటి ఒప్పందం జరిగిందనే విషయం తెలియాల్సి ఉంది. ఆసుపత్రిలో చేరిన రోగుల నుండి చికిత్స కోసం అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశారని తమ విచారణలో తేలిందని తెలిపారు. స్వర్ణ ప్యాలెస్ దుర్ఘటనలో అన్యాయంగా పది మంది చనిపోయారని.. అందులోనూ వారిలో ఎనిమిది మందికి కరోనా నెగిటివ్ అని తేలిందని పేర్కొన్నారు. ఈ కేసులో కీలక వ్యక్తుల సమాచారం అందించిన వారికి లక్ష రూపాయలు నగదు బహుమతి ఇస్తామని సీపీ ప్రకటించారు. Also read this : MS Dhoni reply to PM Modi: ప్రధాని లేఖపై స్పందించిన ధోనీ

Trending News