Vijayawada Woman Wins Mrs India 2021 Title: మిసెస్ ఇండియా- 2021 (Mrs India 2021) అందాల పోటీల్లో తెలుగు మహిళ సత్తా చాటింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ పోటీల్లో విజయవాడకు చెందిన బిల్లుపాటి మల్లిక (Mallika Billupati) విజేతగా నిలిచారు. పేజెంట్స్ ప్రైవేట్ ఇండియా ఆధ్వర్యంలో మొత్తం నాలుగు రోజులు పాటు మిసెస్ ఇండియా- 9వ సీజన్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా మొత్తం 24 మంది మహిళలు పాల్గొన్నారు. వివిధ రౌండ్ల అనంతరం12 మంది టైటిల్ బరిలో నిలవగా...చివరకు మిసెస్ ఇండియా కిరీటం మల్లికను వరించింది.
మల్లిక తండ్రి పేరు సుంకర దుర్గాప్రసాద్. 2019లో ‘'శ్రీమతి అమరావతి'’ టైటిల్ గెల్చుకున్నారు. ఆతర్వాత 2020లో వర్చువల్‌గా నిర్వహించిన ‘'మిసెస్ ఏపీ'’ అందాల పోటీల్లో సెకెండ్ రన్నరప్‌గా నిలిచారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు సుమారు 19వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. మల్లిక మిసెస్ ఇండియా (Mrs India) పోటీల్లో విజేతగా నిలవడం పట్ల కుటుంబ సభ్యులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు.
Also Read: Harnaaz Sandhu: 21 ఏళ్ల తర్వాత.. మిస్ యూనివర్స్‌గా భారత యువతి!!
శ్రీమతి నవదీప్ కౌర్ (Mrs Navdeep Kaur) 'మిసెస్ ఇండియా వరల్డ్ 2021' (Mrs India World 2021) కిరీటాన్ని పొందారు. మిసెస్ ఇండియా వరల్డ్ పోటీలు 1984లో ప్రారంభించారు. ఇటీవల మిస్ యూనివర్స్-2021 (Miss Universe-2021) కిరీటాన్ని భారత (India) యువతి హర్నాజ్ కౌర్ సంధు (Harnaaz Kaur Sandhu) కైవసం చేసుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి