Anakapalli Train Accident: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. జన్మభూమి, సింహాద్రితో సహా పలు రైళ్లు రద్దు

Good Train Derailed: అనకాపల్లి జిల్లా సమీపంలోని తాడి రైల్వే స్టేషన్ దగ్గర గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో విశాఖ-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 16, 2023, 11:46 AM IST
Anakapalli Train Accident: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. జన్మభూమి, సింహాద్రితో సహా పలు రైళ్లు రద్దు

Anakapalli Train Accident: అనకాపల్లి జిల్లాలో గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది. తెల్లవారు జామున  3.35 గంటలకు బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు తాడి-అనకాపల్లి స్టేషన్ల మధ్య పట్టాలు తప్పింది. దీంతో విశాఖపట్నం-విజయవాడ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఐదు బోగీలు పట్టాలు తప్పడంతో ట్రాక్ దెబ్బతింది. దీంతో కొన్ని రైళ్లను రద్దు చేయగా.. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి. 

జన్మభూమి, ఉదయ్, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఇవాళ రద్దు చేశారు. అదే రైళ్ల తిరుగు ప్రయాణం కూడా రద్దయింది. విశాఖ-సికింద్రాబాద్ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ మూడు గంటలు ఆలస్యం కానుంది. విశాఖ నుంచి ఉదయం 5.45కి స్టార్ట్ అవ్వాల్సిన వందేభారత్‌.. 8.45కి బయల్దేరనుంది. విశాఖతోపాటు దువ్వాడ రైల్వే స్టేషన్లలో కూడా పలు రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే రైల్వే సిబ్బంది రంగంలోకి దిగి ట్రాక్ కు మరమ్మత్తులు చేపట్టారు. 

Also Read: Minister Roja Health : ఏపీ మంత్రి రోజాకు అస్వస్థత.. అపోలో ఆస్పత్రికి తరలింపు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News