Minister Roja Health : ఏపీ మంత్రి ఆర్కే రోజా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాలు బెణకడంతో మంత్రి రోజాకు వారం రోజుల పాటు ఫిజియోథెరపీ చేయించారు. అయితే తాజాగా నొప్పి ఎక్కువ అధికమవడంతో మంత్రిని చెన్నైలోని థౌజండ్ లైట్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్చించారు.
శుక్రవారం రోజా చెన్నైలోని తన ఇంట్లో కుటుంబసభ్యులతో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా ఒక్కసారిగా కాలివాపు, నొప్పి రావడంతో అర్ధరాత్రి ఆమెను అపోలో అస్పత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మంత్రి కాలినొప్పి తగ్గిందని.. త్వరలోనే ఆమెను డిశ్చార్జ్ చేస్తారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో పది రోజులుగా నియోజవర్గ కార్యక్రమాలకు రోజా దూరంగా ఉంటున్నారని పార్టీవర్గాలు వెల్లడించాయి. మరోవైపు పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. రోజా త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ప్రస్తుతం రోజా నగరి నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏపీలో రెండోసారి మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జగన్ ప్రభుత్వంపై ప్రతిపక్ష, విపక్ష పార్టీలు చేసే విమర్శలను రోజా తరుచూ తిప్పికొడతారు. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తూ.. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు.
Also Read: AP Schools Summer Holidays: వేసవి సెలవులు పొడగించండి.. సీఎం జగన్‌కు టీడీపీ రిక్వెస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook