Vishakapatnam: విషాదం.. కొడుక్కి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ తండ్రి మృతి

Father dies of heart attack during son funeral: కొడుకు మృతి చెందిన కొద్ది గంటలకే తండ్రి కూడా మృతి చెందిన విషాద ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 13, 2022, 11:45 AM IST
  • విశాఖపట్నంలో విషాద ఘటన
  • కొడుక్కి అంత్యక్రియలు నిర్వహిస్తూ తండ్రి మృతి
  • శ్మశాన వాటికలోనే గుండెపోటుతో కుప్పకూలిన తండ్రి
Vishakapatnam: విషాదం.. కొడుక్కి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ తండ్రి మృతి

Father dies of heart attack during son funeral: కొడుకే ప్రపంచంగా బతికిన ఆ తండ్రి అతని మరణాన్ని తట్టుకోలేకపోయాడు. ఎదిగొచ్చిన కొడుకు అనారోగ్యంతో మృతి చెందడంతో మానసికంగా కుంగిపోయాడు. కొడుకు లేని జీవితాన్ని ఊహించుకోలేక విలవిల్లాడిపోయాడు. కొడుక్కి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూనే అతనూ కుప్పకూలిపోయాడు. గుండెపోటుతో ఆ తండ్రి అదే శ్మశాన వాటికలో కన్నుమూశాడు. ఈ విషాద ఘటన విశాఖపట్నంలోని మల్కాపురంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే... విశాఖపట్నం జిల్లా యారాడకు చెందిన బాయిన అప్పారావు కుటుంబం కొన్నేళ్లుగా మల్కాపురంలో నివసిస్తున్నారు. అప్పారావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నారు. కుమారుడు గిరీష్ (22) బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇదే క్రమంలో ఇటీవల అనారోగ్యం బారినపడిన గిరీష్... పరిస్థితి విషమించడంతో శుక్రవారం (ఫిబ్రవరి 11) మృతి చెందాడు.

స్థానిక శ్మశాన వాటికలో శనివారం (ఫిబ్రవరి 12) గిరీష్ అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ సంస్కారాల్లో భాగంగా తండ్రి అప్పారావు గిరీష్ చితి చుట్టూ తిరుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పారావు మృతి ఆయన కుటుంబ సభ్యులను షాక్‌కి గురిచేసింది. భర్త, కుమారుడు ఒకేసారి మృతి చెందడంతో అప్పారావు భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

Also Read: ఉక్రెయిన్‌పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. పుతిన్‌కు బైడెన్ స్ట్రాంగ్ వార్నింగ్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News