కేంద్ర బడ్జెట్ 2018ని ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశబెట్టాక..అందులో తెలుగు రాష్ట్రాలకు ప్రభుత్వం చేసిన కేటాయింపులు ఏమిటో మనమూ ఒకసారి తెలుసుకుందాం
ఆంధ్రప్రదేశ్‌కి జరిగిన కేటాయింపులు
*ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీకి రూ.32 కోట్లు కేటాయించారు.
*కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ.10 కోట్లు కేటాయించారు.
*గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.10 కోట్లు కేటాయించారు
*విశాఖ పోర్టుకు రూ.108 కోట్లు కేటాయించారు
*ఎన్‌ఐటీ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి)కి రూ.54 కోట్లు కేటాయించారు.
*ఐఐటీకి రూ.50 కోట్లు కేటాయించారు.
*ట్రిపుల్ ఐటీకి రూ.30 కోట్లు కేటాయించారు.
*ఐఐఎంకు రూ.42 కోట్లు కేటాయించారు.
*ఐఐఎస్‌సీఆర్‌కు రూ.49 కోట్లు కేటాయించారు.
*డ్రెడ్జింగ్ కార్పోరేషన్‌కు రూ.19.62 కోట్లు కేటాయించారు.
తెలంగాణకు కేటాయింపులు ఇలా..
*హైదరాబాద్ ఐఐటీకి రూ.75 కోట్లు కేటాయించారు.
*గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.10 కోట్లు కేటాయించారు.
*తెలంగాణలో సింగరేణికి రూ 2 వేల కోట్ల పెట్టుబడులు సమకూర్చనున్నట్టు తెలిపారు
ఏపీ, తెలంగాణలకు 'బడ్జెట్ 2018' ఏమిచ్చిందో తెలుసా..!