రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అటు ముఖ్యమంత్రి పదవికి.. కాంగ్రెస్ పార్టికి గుడ్ బై చెప్పిన కిరణ్ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయన రాజకీయాల్లో రావాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఆయన పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తే ..ఎటువైపు మొగ్గు చూపుతారనే అంశంపై ఉత్కంఠత నెలకొంది.
కిరణ్ పై ఆసక్తి చూపుతన్న కాంగ్రెస్ ..
విభజన నిర్ణయం తీసుకొని ప్రజాభిమానం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ కి దాదాపు ముఖ్యనేతలంతా దూరమ్యాయరు. దీంతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడుచుకుపోయినట్లయింది. పోయిన చోటే వెతుక్కోవాలని అన్న ధోరణిలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ చర్యలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ను మళ్లీ పార్టీలోకి తీసుకుంటే పార్టీ కొంతమేరకైనా రాష్ట్రంలో పట్టుసాధించగల్గుతుందనే నమ్మకంతో ఉంది. అధిష్టానం పెద్దలు ఈ మేరకు కిరణ్ కుమార్ రెడ్డి తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది...
కిరణ్‌కుమార్‌రెడ్డికి బీజేపీ గాలం
ఏపీలోబలపడాలనే ప్రయత్నంలో ఉన్న బీజేపీలు మాత్రం అడపాదడపా కిరణ్ ను కదిలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల చిత్తూరు జిల్లాకు వెళ్లిన బీజేపీ నేత పురందేశ్వరి అక్కడ కిరణ్ కుమార్ రెడ్వితో తో సమావేశం అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. పార్టీలోకి చేరమని ఆమె కిరణ్ ను ఆహ్వానించారట.
డైలమాలో కిరణ్ కమార్‌రెడ్డి..
రెండు జాతీయ పార్టీల నుంచి కిరణ్ కుమార్ రెడ్డికి ఆఫర్లు వస్తుండంతో ఆయన ఎటువైపు మొగ్గు చూపాలనే అంశంపై డైలమాలో పడ్డారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ లో చేరాలా ..లేదా అధికారంలో ఉన్న బీజేపీలో చేరాలా అనే దానిపై కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ లో చేరితో కిరణ్ నాయకత్వ పగ్గాలు ఇవ్వడం ఖాయం..అయితే ఏపీలో కాంగ్రెస్ కోలుకోలేని స్థితిలో ఉంది. ఇలాటప్పుడు వెళ్లి కాంగ్రెస్ లోకి చేరితే కిరణ్ కు దక్కేది ఏమీ లేదు. బీజేపీ అయితే కనీసం రాజ్యసభ సభ్యత్వాన్ని ఇవ్వగలదు. దీనిపై కిరణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.