జగన్‌తో ఓవైసీ దోస్తీ వెనక ఉన్న వ్యూహం ఏంటి ? ఆయన టార్గెట్ ఎవరు.. టీడీపీ (లేదా ) బీజేపీ

ఏపీలో ఎంఐఎం చీఫ్ అసుద్దీన్ అనుసరిస్తున్న వ్యూహం వెనుక లక్ష్యం ఇదేనా 

Last Updated : Dec 24, 2018, 05:22 PM IST
జగన్‌తో ఓవైసీ  దోస్తీ వెనక ఉన్న వ్యూహం ఏంటి ?  ఆయన టార్గెట్ ఎవరు.. టీడీపీ (లేదా ) బీజేపీ

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఎప్పుడు లేని విధంగా ఏపీ రాజకీయాలపై  సీరియస్ గా దృష్టి సారించారు. జగన్ స్నేహం హస్తం కోరనప్పనటికీ.. తనకు జగన్ మిత్రుడని.. ఆయనకు మద్దతుగా ఏపీలో ప్రచారం చేస్తానని అసుదుద్దీన్ ప్రకటించడం గమనార్హం. అసలు అసదుద్దీన్  జగన్ మద్దతు విషయంలో ఎందుకలా చొరవ చూపుతున్నారు అనేది ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.

చంద్రబాబు తన ఇలాఖాలో తమకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారనే పరిణామాలు చూపించి ..చంద్రబాబు టార్గెట్ చేసుకొని ఏపీలో ప్రచారం చేస్తానని ఓవైసీ ప్రకటన చేశారు. అయితే ఇది కొంత వరకు వాస్తవం అయినప్పనటికీ..ఓవైసీ అలా వ్యవరించడానికి మరో బలమైన కారణముందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. ఇంతకీ ఆ కారణం ఏమైఉంటది... వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది.

ఏపీలోనూ తెలంగాణ ఫార్మాలా ?

తెలంగాణలో అనుసరించిన ఫార్మాలానే ఓవైసీ ఏపీలో అనుసరించాలని చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో ఓవైసీ మాట్లాడుతూ  కేసీఆర్ కు మద్దతు ఇవ్వకపోతే ఆయన బీజేపీ వైపు మొగ్గుచూపుతారని.. అందుకే కేసీఆర్ తో దోస్తీ చేస్తున్నామని ప్రకటించారు. ఏది ఏమైనా ఓవైసీ వ్యూహంతో తెలంగాణలో ఒంటరైన బీజేపీ దారుణంగా దెబ్బతింది. ఇప్పుడు ఏపీలో కూడా బీజేపీకి ఒంటరి చేయాలనే లక్ష్యంతో ఓవైసీ  వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి

ఏపీలోనూ బీజేపీని ఒంటరి చేసే ఎత్తగడ
ప్రస్తుతానికి జగన్ బీజేపీ వైపు చూడకపోయినప్పటికీ ఎన్నికల నాటి రాజకీయ అవసరాలు ఏర్పడితే ఆయన తప్పని పరిస్థితిలో బీజేపీ మద్దతు తీసుకనే అవకాశం ఉంది. ఇదే అవసరం కోసం బీజేపీ కూడా ఎదురు చూస్తోంది. ఈ విషయాన్ని గ్రహించిన ఓవైసీ..జగన్ తో తాము దోస్తీ చేస్తే ఇక్కడ టీఆర్ఎస్ తరహా జగన్ పార్టీ బీజేపీ వైపు చూడని పరిస్థితి నెలకొంటుంది. ఫలితంగా బీజేపీ ఒంటరై ఏపీలోనూ దూకాణం క్లోజ్ చేసుకునే పరిస్థితి నెలకొంటుందనేది ఓవైసీ అంచనా అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఓవైసీతో దోస్తీకి జగన్ ఒప్పుకునేనా ?
అయితే ఇక్కడ కేసీఆర్ తరహా జగన్.. ఓవైసీతో దోస్తీ ఒప్పుకుంటారా అనేది ఇక్కడ ప్రశ్న ఉత్పన్నమౌతుంది. హైదరాబాద్ లో అంటే ఎంఐఎంకు కాస్తకూస్తే బలం ఉంది కాబట్టి..కేసీఆర్ ఒప్పుకున్నారు..అయితే ఏపీలో ఏమాత్రం బలం లేని ఎంఐఎంతో దోస్తే చేస్తారా అనేది ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. ఇప్పటి వరకు జగన్ అనుసరిస్తున్న స్టాటజీ చూస్తుంటే ఎన్నికల తర్వాతే ఆయన ఏదైనా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఒంటరిపోరుకే ఆయన మొగ్గుచూపుతున్నాట్లు తెలుస్తోంది. ఎంఐఎంతో దోస్తీ చేస్తే ఎన్నికల తర్వాత కేంద్రలోని  బీజేపీతో జతకట్టే దారులు శాశ్వతంగా మూసుకుపోతాయి.. ఇలా లెక్కలు వేసుకుంటున్న వైసీపీ అంతిమంగా పొత్తులు, మద్దతు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠత నెలకొంది

Trending News