చంద్రబాబు Vs జగన్:  ఓటింగ్ శాతం పెరగడం ఎవరికి అనుకూలం..?

ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు అయింది.

Last Updated : Apr 12, 2019, 11:24 AM IST
చంద్రబాబు Vs జగన్:  ఓటింగ్ శాతం పెరగడం ఎవరికి అనుకూలం..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 80 శాతం వరకు పోలింగ్ నమోదు అయింది. 2014తో పోలిస్తే సుమారు 3 శాతం వరకూ పెరిగింది. ఒకవైపు  ఈవీఎంలు మొరాయించడం...మరోవైపు హింసాత్మ ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ ...ఓటర్లు ఇలాంటి ప్రతికూల అంశాలను ఏమాత్రం లెక్కచేయలేదు. ఎలాగైనా ఓటు వేయాలనే కసితో అర్ధరాత్రి 12 గంటలు దాటుతున్నా ఓటు వేసేందుక పోలింగ్ బూత్ వద్ద బారులు దీరారు . ఇలా అడ్డంకులు వచ్చినా ప్రజలు ఓటు వేసేందుకు ముందుకు రావడం గమనార్హం. 
 

ఓటింగ్ శాతం పెరగడంతో ఈ పరిణామం తమకే  అనుకూలమని అధికార పార్టీ టీడీపీ చెబుతుంటే.. తామే కచ్చితంగా గెలుస్తామని విపక్ష వైసీపీ బల్లగుద్ది చెబుతోంది. ఇలా ఇరు పార్టీల వాదన నేపథ్యంలో ఓటింగ్ శాతం పెరగడం ఎవరికి అనుకూలిస్తుందనే దానేది చర్చనీయంశంగా మారింది
 

'పసుపు - కుంకుమ', పింఛన్ల పెంపు, రాజధాని నిర్మాణం, పోలవరం తదితరాలు తమకు అనుకూలమని టీడీపీ వాదిస్తుంది..మరోవైపు వైసీపీ మరో రకంగా వాదిస్తుంది. గత ఐదేళ్ల పాలనలో వచ్చిన ప్రజా వ్యతిరేకతే ఓట్ల రూపంలో వెల్లువెత్తిందని వైసీపీ చెబుతోంది. ఈ ఎన్నికల్లో విజయం తమదేనని రెండు పార్టీలూ ఘంటాపథంగా చెబుతున్నాయి. అయితే ఓటర్ దేవుళ్లు ఎవరికి కరుణించారనేది తేలాలంటే మే 23 న వెలువడే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే...

Trending News