AP CAPITAL: సీబీఐ కేసులో జగన్ లాయరే సుప్రీంకోర్టు సీజేఐ.. ఏపీ రాజధాని కేసుపై టీడీపీ నేతల డౌట్స్?

AP CAPITAL:  ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మళ్లీ హాట్ హాట్ గా మారింది. అమరావతే రాజధాని అంటూ ఏడు నెలల క్రితం ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది జగన్ సర్కార్. హైకోర్టు తీర్పు పై ఇప్పుడు పిటిషన్ వేయడం చర్చగా మారింది

Written by - Srisailam | Last Updated : Sep 19, 2022, 12:05 PM IST
  • ఏడు నెలల తర్వాత పిటిషన్
  • జగన్ సర్కార్ తీరుపై పలు అనుమానాలు
  • టీడీపీ నేత పయ్యావుల సంచలన వ్యాఖ్యలు
AP CAPITAL: సీబీఐ కేసులో జగన్ లాయరే సుప్రీంకోర్టు సీజేఐ.. ఏపీ రాజధాని కేసుపై టీడీపీ నేతల డౌట్స్?

AP CAPITAL:  ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మళ్లీ హాట్ హాట్ గా మారింది. అమరావతే రాజధాని అంటూ ఏడు నెలల క్రితం ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది జగన్ సర్కార్. రాజధాని అంశం రాష్ట్రానికి సంబంధించిన విషయమని తన పిటిషన్ లో పేర్కొంది. పాలనా వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులని వెల్లడించింది. అసెంబ్లీ వర్షకాల సమావేశాల తొలి రోజే సభలో వికేంద్రకరణపై చర్చను చేపట్టింది వైసీపీ ప్రభుత్వం. చర్చలో పాల్గొన్న సీఎం జగన్.. పాలనా వికేంద్రకరణే తమ విధానమని స్పష్టం చేశారు. మూడు రాజధానుల ప్రకటన చేయకపోయినా.. తమ సర్కార్ విధానం అదేననే సంకేతం ఇచ్చారు. జగన్ ప్రసంగంతో అసెంబ్లీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడతారనే ప్రచారం సాగింది. కాని ఇంతలోనే మూడు రాజధానులపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లింది జగన్ సర్కార్. దీంతో సుప్రీంకోర్టులో రాజధాని కేసు విచారణ ఆసక్తిగా మారింది. తీర్పు ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ నెలకొంది.

రాజధానికి సంబంధించి ఏడు నెలల క్రితం హైకోర్టు తీర్పు ఇచ్చినా సుప్రీంలో సవాల్ చేయలేదు జగన్ సర్కార్. ఇప్పుడు పిటిషన్ వేయడం చర్చగా మారింది. జగన్ సర్కార్ ఇంతకాలం ఎందుకు సుప్రీంకోర్టుకు వెళ్లలేదు... ఇప్పుడెందుకు వెళ్లారన్నదానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో రాజధాని అంశం కేంద్రంగా ఉండాలని వైసీపీ భావిస్తోందని.. అందుకే ఇంతకాలం వెయిట్ చేసి ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లిందని అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో రాజధాని అంశాన్ని ప్రస్తావిస్తూ ఉత్తరాంధ్ర, రాయలసీమలో లబ్ది పొందాలన్నది జగన్ వ్యూహంగా ఉందనే చర్చ సాగుతోంది. అయితే తాజాగా అమరావతి విషయంలో జగన్ సర్కార్ దూకుడు పెంచడానికి మరో కారణం ఉందన్న వాదన వస్తోంది.

ఏపీ రాజధాని అంశంపై సుదీర్ఘ విచారణ తర్వాత గత మార్చి నెలలో హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. అమరావతే  ఏపీ రాజధాని అని తేల్చి చెప్పింది. రాజధానిపై చట్టం చేసే అధికారం శాసనసభకు లేదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.  సీఆర్‌డీఏ చట్టప్రకారం వ్యవహరించాలని,  ఆరు నెలల్లో మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం అభివృద్ధి చేయాలని జగన్ సర్కార్ ను ఆదేశించింది. అయితే హైకోర్టు తీర్పుపై జగన్ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లలేదు. ఏడు నెలల తర్వాతా తాజాగా పిటిషన్ వేయడంలో పలు అనుమానాలు వస్తున్నాయి. తెలుగువారైన జస్టిస్ ఎన్వీ రమణ గత నెల వరకు సుప్రీంకోర్టు సీజేఐగా ఉన్నారు. జస్టిస్ రమణతో జగన్ కు విభేదాలున్నాయి. జస్టిస్ రమణపై పలు ఆరోపణలు చేస్తూ ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి జగన్ లేఖ రాయడం అప్పట్లో దేశంలో పెను సంచలనం స్పష్టించింది. సీజేఐగా చీఫ్​ జస్టిస్​ ఎన్వీ రమణ ఉన్న సమయంలో పిటిషన్​ వేస్తే తమకు అనుకూలంగా తీర్పు రాదనే ఉద్దేశంతోనే జగన్ సర్కార్ అప్పీల్ కు వెళ్లలేదనే వాదన కొన్ని వర్గాల నుంచి వస్తోంది. ఇప్పుడు కొత్త జస్టిస్ రావడంతో మూడు రాజధానులపై పిటిషన్​ వేసినట్లు చెబుతున్నారు,

మరోవైపు మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంపై టీడీపీ సీనియర్ పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజధానిపై నిర్ణయం చేసే అధికారం రాష్ట్రానికి లేదని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పారు. రాజధాని అంశాన్ని  వ్చచే ఎన్నికలు వరకు వాయిదాలు వేసేలా వైసీపీ ప్రయత్నిస్తోందనే అనుమానం వ్యక్తం చేసారు. సుప్రీంకోర్టు ప్రస్తుత సీజేఐ జస్టిస్ లలిత్ గతంలో జగన్ తరపున వివిధ కేసుల్లో అడ్వకేటుగా ఉన్నారని చెప్పారు. సీజేఐ గతంలో జగన్ తరపున వాదించారంటూ పయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జస్టిస్ లలిత్ సీజేఐ ఉన్నారు కాబట్టే.. జగన్ సర్కార్ మూడు రాజధానుల విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లిందనే వాదన టీడీపీ వర్గాల నుంచి వస్తోంది. దీంతో రాజధాని కేసులో ఎలాంటి తీర్పు వస్తుందన్నది ఆసక్తిగా మారింది.

Also read:  Sangareddy Collecter: బ్యూరోక్రాట్లా.. భజన బృందాలా! మొన్న ఎస్పీ.. నిన్న కలెక్టర్..  పబ్లిక్ గా  కేసీఆర్ భజన?

Also read: Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో మరో సంచలనం.. రామచంద్రన్ ను ప్రశ్నించిన ఈడీ.. నెక్స్ట్ కవితేనా?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok

Trending News