Avinash Reddy Bail Petition: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ పిటీషన్‌పై తెలంగాణ హైకోర్టులో దాదాపు 7 గంటల సేపు అత్యంత ఉత్కంఠభరితంగా వాదనలు కొనసాగాయి. సుదీర్ఘంగా సాగిన వాదనల అనంతరం వాదనలు రేపటికి వాయిదా పడ్డాయి. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చేది లేనిదీ రేపు తేలిపోనుంది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్‌పై ఇవాళ ఉదయం 11 గంటల్నించి సాయంత్రం 6 గంటల వరకూ తెలంగాణ హైకోర్టులో సినీ ఫక్కీలో వాదోపవాదాలు జరిగాయి. ఇటు అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు, అటు సీబీఐ, సునీత తరపు న్యాయవాదుల మధ్య పోటాపోటీగా వాదనలు కొనసాగాయి. వాస్తవానికి ఇవాళ వాదనలు పూర్తి చేస్తామని హైకోర్టు న్యాయమూర్తి స్పష్టం చేయడంతో బెయిల్ పిటీషన్‌పై నిర్ణయం కూడా ఇవాళే వెలువడుతుందని భావించారు. కానీ రేపటికి విచారణ వాయిదా పడింది.
అసలు ఈ కేసు గురించి తనకు తెలియదని..వివరాలు చెప్పాలని అవినాష్ రెడ్డి న్యాయవాదిని న్యాయమూర్తి అడగడంతో, హత్య జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకూ జరిగిన పరిణామాల్ని వివరించారు. సీబీఐ కూడా కేసు ప్రారంభించిన 4 నెలల తరువాతే ఎఫ్ఐఆర్ నమోదు చేసిందన్నారు. ముందు నుంచీ సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకే అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వస్తోందని వివరించారు. ఈ కేసులో ఏ1 గంగిరెడ్డితో వివేకానందరెడ్డికి విబేధాలున్నాయన్నారు.
గుండెపోటు అని చెప్పినంత మాత్రాన నేరం చేసినట్టేనా అవినాష్ రెడ్డి న్యాయవాది వివరించారు. ఈ కేసులో అవినాష్ రెడ్డిని ఇరికించేలా ముందు నుంచీ కుట్ర జరుగుతోందని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది తెలిపారు. వివేకా హత్య కేసులో సీబీఐ ఇప్పటి వరకూ ఎక్కడా అవినాష్ రెడ్డి నిందితుడని చెప్పలేదన్న సంగతి గుర్తు చేశారు. ఈ కేసులో అనుబంధ ఛార్డ్ షీటు దాఖలు చేసిన ఏడాది తరువాతే అవినాష్ రెడ్డిని సెక్షన్ 160 ప్రకారం నోటీసులు పంపించారన్నారు. అవినాష్ రెడ్డి కూడా 7 సార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారన్నారు.
తల్లి అనారోగ్యం కారణంగానే ఈ నెల 16, 19 తేదీల్లో అవినాష్ రెడ్డి విచారణకు హాజరుకాలేదని ఆ విషయాన్ని సీబీఐకు సమాచారం కూడా అందించామన్నారు. మరోవైపు ఈ కేసు విచారణలో భాగంగా సునీతపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హద్దుల్లో ఉండాలంటూ వార్నింగ్ సైతం ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ముంచు రెండు వర్గాలు వాదనలు విన్పించాయి.
Also read: New Parliament Building: పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి టీడీపీ.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook