'తాము అధికారంలోకి వస్తే చేనేత కార్మికులకు ఇస్తున్న వెయ్యి రూపాయల రాయితీని రెండు వేలకు పెంచుతాం' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగ్మోహన్ రెడ్డి ప్రకటించారు. బెంగళూరు నుండి రోడ్డు మార్గంలో ధర్మవరానికి చేరుకున్న ఆయన, చేనేతలకు రూ. వెయ్యి రాయితీ కోసం 37 రోజులుగా దీక్షలు చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలిపారు. దీక్షకు మద్దతు తెలిపిన అనంతరం ప్రజనుద్దేశించి ప్రసంగించారు.
"అధికారంలోకి వచ్చి చంద్రబాబు ప్రభుత్వం నాలుగేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలను అమలుచేయలేదు. చేనేతలకు రూ. 600 నుంచి రూ. 1000 రాయితీ ప్రకటించి సంవత్సరం గడుస్తున్నా అమలు చేయలేదని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వస్తే చేనేతలకు రాయితీ వెయ్యి నుంచి రెండువేలకు పెంచుతామని, వారికి ఆరోగ్య భీమా సదుపాయం కల్పిస్తామని ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకు ఇస్తున్న వెయ్యి రూపాయల పింఛన్ కు బదులు రెండువేలు ఇస్తాం. 50 ఏళ్లకు ఇస్తున్న పింఛన్ ను 45 ఏళ్లకే వర్తించేలా చట్టం తీసుకొస్తాం. నేతన్నలకు రుణమాఫీ.. లక్ష వరకు వడ్డేలేని ఋణం బ్యాంకుల ద్వారా ఇప్పిస్తాం. రాష్ట్రంలోని పేదలకు 25 లక్షల పక్కాఇళ్లులు కట్టిస్తాం" అని జగన్ అన్నారు. చంద్రబాబు నాయుడు ఏడాదిలోపు ఎన్నికలు వస్తాయని అంటున్నాడు (కేంద్రం, దేశం అంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది) . ఆ ఎన్నికల్లో అన్న (వైఎస్ జగన్మోహన్ రెడ్డి) ముఖ్యమంత్రి కావాలని దేవుణ్ణి ప్రార్థించండని జగన్ ప్రజలను కోరారు.