వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు: గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్న జగన్

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య: గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్న జగన్

Updated: Mar 16, 2019, 09:36 AM IST
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు: గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్న జగన్

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అనేక అనుమానాలకు తావిస్తోన్న నేపథ్యంలో వైఎస్ జగన్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లో రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలవనున్నారు. తన బాబాయ్ హత్యపై సీబీఐ చేత లోతైన దర్యాప్తు జరిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ గవర్నర్‌కు విజ్ఞప్తి చేయనున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతోపాటు టీడీపి పరిపాలనలో అనేక ఇతర రాజకీయ హత్యలు జరిగాయని, వాటన్నింటిపై సైతం విచారణ జరపాల్సిందిగా వైఎస్ జగన్ గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకురానున్నారని తెలుస్తోంది.