కేటీఆర్‌తో పోల్చుతూ నారా లోకేష్‌ సామర్ధ్యాన్ని ప్రశ్నించిన షర్మిల

                              

Last Updated : Mar 25, 2019, 12:09 PM IST
కేటీఆర్‌తో పోల్చుతూ నారా లోకేష్‌ సామర్ధ్యాన్ని ప్రశ్నించిన షర్మిల

మళ్లీ పొలిటికల్ స్కీన్ పై వైఎస్ షర్మిలా దర్శనమిచ్చారు. వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చంద్రబాబు తనయుడు నారా  లోకేష్ ను టార్గెట్ చేస్తూ షర్మిల సెటైర్లు వేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ బాబు వస్తే జాబు వస్తుందని గత ఎన్నికల్లో టీడీపీ వారు ప్రచారం చేశారు. బాబు వచ్చిన తర్వాత ఎంత మందికి జాబు వచ్చిందని ప్రశ్నించారు. జాబు కాదు కదా ..కనీసం నోటిఫికేషన్ కూడా రాలేదని షర్మిల ఎద్దేవ చేశారు

లోకేష్ కు జయంతికి వర్ధంతికి తేలియదు

 షర్మిల మాట్లాడుతూ ఒక్కటి మాత్రం నిజం బాబు వస్తే ఆయన కుమారుడికి మంచి జాబు వచ్చింది. చంద్రబాబు అధికారింలోకి వచ్చిన తర్వాత లోకేష్ కు ఒకేసారి మూడు ఉద్యోగాలు ఇచ్చారు. ఏ అర్హత లేని లోకేష్ కు  మూడు శాఖలకు మంత్రి చేశారని విమర్శించారు. జయంతికి వర్ధంతికి తేడా తెలియని లోకేష్ కు మంత్రి పదవి ఎలా ఇచ్చారని  ఈ  సందర్భంగా షర్మిల ప్రశ్నించారు.

కేటీఆర్‌తో లోకేష్ కు పోలికా ?

తెలంగాణలో సీఎం కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ ను ఐటీ మంత్రి చేశారని..ఇక్కడ చంద్రబాబు కూడా అదే చేశారు. ఏ మాత్రం అర్హత లేని లోకేష్ కు ఐటీశాఖకు మంత్రిని చేశారు .  కేటీఆర్ సాధించిన ఘన కార్యాలు లోకేష్ చేయగలిగారా అంటూ ప్రశ్నించారు. కేటీఆర్ ఐటీ శాఖను సమర్ధవంతంగా నిర్వర్తించి హైదరాబాద్ లో భారీ ఎత్తున కంపెనీలు వచ్చేలా చేశారు..కానీ ఇక్కడ లోకేష్ ఏం చేశారని ప్రశ్నించారు . కనీసం అఆ లు కూడా రాని వాడు అగ్రతాంబులం నాదే అన్నట్లుగా...లోకేష్ విర్రవీగుతన్నాని షర్మిల విమర్శించారు

Trending News