Avinash Reddy Bail: అవినాష్ రెడ్డికి బిగ్ రిలీఫ్.. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు

Avinash Reddy Bail: వైఎస్ వివేకా హత్య కేసులో ఎట్టకేలకు కడప ఎంపీ అవినాష్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 2, 2023, 08:55 AM IST
Avinash Reddy Bail: అవినాష్ రెడ్డికి బిగ్ రిలీఫ్.. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు

High Court Issues Anticipatory Bail: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఇప్పటి వరకూ 7 సార్లు విచారించింది. ఆ తరువాత అవినాష్ రెడ్డి అరెస్టుకు దాదాపు రంగం సిద్దమైన తరుణంలో తల్లి అనారోగ్యం కారణలతో అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కాలేదు. ఈలోగా ఏప్రిల్ 17న ముందస్తు బెయిల్ కోరుతూ అవినాష్ రెడ్డి పిటీషన్ దాఖలు చేశారు. తొలుత తెలంగాణ హైకోర్టు బెయిల్ పిటీషన్ పై వాదనలు వినకపోవడంతో అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ నెల 26,27 తేదీల్లో తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ పిటీషన్‌పై రెండ్రోజులపాటు హోరోహోరీగా వాదనలు కొనసాగాయి. అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యంతో ఉన్న కారణంగా కేసు తదుపరి విచారణ అంటే ఇవాళ్టి వరకూ వాయిదా వేసిన కోర్టు అప్పటి వరకూ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దని ఆదేశించింది. 

Also Read: CM KCR Record: రేపటితో ముఖ్యమంత్రిగా కేసీఆర్ అరుదైన రికార్డు, ఒకే ఒక్కడు

ఇవాళ ఈ కేసులో తెలంగాణ హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో సీబీఐ దర్యాప్తుకు సహకరించాలని, సీబీఐ అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లకూడదని షరతు విధించింది. సాక్షుల్ని ప్రబావితం చేయకూడదని సూచించింది. జూన్ నెలాఖరు వరకూ ప్రతి శనివారం సీబీఐ ముందు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. సీబీఐకు అవసరమైనప్పుడు విచారణకు హాజరుకావాలని టీఎస్ హైకోర్టు వెల్లడించింది.

Also Read: Margadarsi Issue: మార్గదర్శి కేసులో వేగం పెంచిన సీఐడీ, శైలజా కిరణ్‌కు లుక్ అవుట్ నోటీసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News