CM KCR Record: రెండు తెలుగు రాష్ట్రాల్లో లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకూ ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించబోతున్నారు. రేపటితో ఆ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఆ రికార్డు ఏంటనే వివరాలు తెలుసుకుందాం..
మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్రరాష్ట్రం వరకూ ఆ తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 32 మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి కాగా విభక్త ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌గా ఉన్నారు. ఇక మద్రాస్ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా పొనగంటి రాయనింగర్ ఉంటే ఆంధ్రరాష్ట్రం తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు, ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి పనిచేశారు.
నిరాటంకంగా ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా..
ఇక ఎవరు ఎంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు, నిరాటంకంగా ఎవరెక్కువ కాలం పనిచేశారనే వివరాలు పరిశీలిద్దాం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా 2014 జూన్ 2వ తేదీన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. రేపు అంటే 2023 జూన్ 2వతేదీతో 9 ఏండ్ల పదవీకాలం పూర్తి చేసుకోనున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఏకబిగిన అంటే నిరాటంకంగా 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన తొలి తెలుగు వ్యక్తిగా కేసీఆర్ రికార్డు సాధిస్తున్నారు. ఇప్పటి వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పనిచేసిన 24 మంది ముఖ్యమంత్రుల్లో ఎవరికీ దక్కని ఖ్యాతి సాధించబోతున్నారు.
రెండవ స్థానంలో చంద్రబాబు
తెలంగాణ కొత్త రాష్ట్రానికి మధ్యలో గ్యాప్ లేకుండా ఏకబిగిన 9 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా ఆ ఘనత దక్కించుకుంటున్న ఏకైక వ్యక్తి అవుతున్నారు కేసీఆర్. అంతకుముందు ఈ రికార్డు ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు పేరిట ఉంది. చంద్రబాబు నిరాటంకంగా ముఖ్యమంత్రిగా పనిచేసింది. 8 ఏళ్ల 256 రోజులు. మూడు పర్యాయాలు కలుపుకుంటే మాత్రం 13 ఏళ్ల 247 రోజులు ముఖ్యమంత్రిగా చేశారు.
కేసీఆర్ రికార్డు మాత్రం చాలా అరుదైనది. ఇప్పటి వరకూ ఎవరికీ దక్కనిది. కేసీఆర్ రికార్డు అయితే స్వాతంత్య్రానికి పూర్వం ఉన్న మద్రాసు ప్రెసిడెన్సీ, ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం, హైదరాబాద్ స్టేట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పరిశీలించినా నిరాటంకంగా 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కేసీఆర్ ఒక్కడే.
నిరాటంకంగా ఎవరెన్ని రోజులు
నిరాటంకంగా అంటే బ్రేక్ లేకుండా ముఖ్యమంత్రిగా ఎక్కువసార్లు చేసిన ఘనత ఇప్పుడు కేసీఆర్ దక్కించుకున్నారు. గతంలో ఈ రికార్డు చంద్రబాబు పేరిట 8 ఏళ్ల 256 రోజులుండేది. ఆ తరువాత కాసు బ్రహ్మానందరెడ్డి 7 ఏళ్ల 221 రోజులు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి 5 ఏళ్ల 111 రోజులు పదవిలో ఉన్నారు. ఎన్టీ రామారావు 7 ఏళ్ల 196 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసినా మూడు పర్యాయాలు కలిపి చేశారు. అంటే అత్యదికంగా నిరాటంకంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత కేసీఆర్‌దే. 2018 డిసెంబర్ వరకూ ఆయనే కొనసాగనున్న నేపధ్యంలో 9 ఏళ్లకు మరో 7 నెలలు అంటే 210 రోజులు యాడ్ చేసుకోనున్నారు.
Also read: Asaduddin Owisi : కేసీఆర్, ఓవైసీల మధ్య గ్యాప్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook