Ysrcp Candidates List: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధుల జాబితాలో బీసీ, మైనార్టీలకు గతం కంటే ఎక్కువ సీట్ల కేటాయింపు జరిగింది. అదే విదంగా మహిళలకు కూడా గతం కంటే సీట్లు పెంచారు. 2019లో బీసీలకు 41 స్థానాలు కేటాయిస్తే ఈసారి 48 సీట్లు కేటాయించారు వైఎస్ జగన్. ఇక మైనార్టీలకు 2019లో 5 స్థానాలు కేటాయిస్తే ఈసారి 7 స్థానాలు కేటాయించారు.
వైసీపీ ప్రకటించిన 175 ఎమ్మెల్యే అభ్యర్ధుల్లో ఎస్సీలు 29, ఎస్టీలు 7 మంది ఉన్నారు. బీసీలకు ఈసారి అత్యధికంగా 48 స్థానాలు కేటాయించారు. ఇక మహిళా అభ్యర్ధులు 2019లో 15 మంది ఉంటే ఈసారి అత్యధికంగా 19 మంది ఉన్నారు. ఇక కాపులకు ఏకంగా 20 సీట్లు కేటాయించింది. ఇక కమ్మ సామాజికవర్గానికి 9 సీట్లు కేటాయించింది. ఇక బీసీల తురవాత అత్యధిగా రెడ్లకు 45 సీట్లు కేటాయించింది. క్షత్రియులకు 6 స్థానాలు కేటాయించారు.
ఇక ఎంపీ అభ్యర్ధుల్లో బీసీలకు ఏకంగా 11 స్థానాలు కేటాయించారు. అంటే 45 శాతం కంటే ఎక్కువే. కాపులకు 3 స్థానాలు, కమ్మ సామాజికవర్గానికి ఒక స్థానం కేటాయించారు. అటు ఎమ్మెల్యే, ఇటు ఎంపీ మొత్తం 200 స్థానాలకు లెక్కేస్తే ఎస్సీలకు 33, ఎస్టీలకు 8 స్థానాలు కేటాయించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇక బీసీలకు 59 స్థానాలిచ్చింది. ఓసీలకు 100 స్థానాలు కేటాయించింది. వైసీపీ టికెట్ కేటాయించిన 25 మంది ఎంపీ అభ్యర్ధుల్లో 88 శాతం మంది ఉన్నత విద్యావంతులు కావడం విశేషం. వీరిలో 22 మంది డిగ్రీ, ఆ పై చదువుకున్నవారు కాగా, ఐదుగురు డాక్టర్లు, నలుగురు లాయర్లు ఉన్నారు.
Also read: Mudragada Padmanabham: జనసేన త్వరలో క్లోజ్ అవుతుంది, పవన్ కళ్యాణ్‌పై ముద్రగడ తీవ్ర వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook