Legislative Council: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఇప్పుడిక అధికార పార్టీదే హవా వీయనుంది. ప్రతిపక్షం తెలుగుదేశం ఆధిక్యానికి అడ్డుకట్టు పడింది. తెలుగుదేశం ఆధిక్యం తగ్గగా..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం పెరుగుతూ వస్తోంది.
ఏపీ శాసన మండలిలో మొన్నటి వరకూ తెలుగుదేశం (Telugu Desam) పార్టీదే ఆధిక్యత. అందుకే తెలుగుదేశం పార్టీ..ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమైన బిల్లుల్ని అడ్డుకుంటూ వచ్చింది. మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకించింది. ఇంగ్లీష్ మీడియం బోధన బిల్లును అడ్డుకుంది. ఈ పరిణామాలతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. శాసన మండలిలో తెలుగుదేశం (Telugu Desam) ఆధిక్యత తగ్గుతూ వస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం పెరుగుతూ పోతోంది. టీడీపీకు చెందిన ఏడుగురు ఎమ్మెల్సీల పదవీకారం ముగియడంతో టీడీపీ బలం తగ్గింది. ప్రస్తుతం మండలిలో వైసీపీ బలం 21 కాగా..టీడీపీకు 15 మంది సభ్యులున్నారు.ఎమ్మెల్సీలుగా ఉన్న రెడ్డి సుబ్రహ్మణ్యం, రాజేంద్ర ప్రసాద్, బుద్దా వెంకన్న, పప్పుల చలపతిరావు, గాలి సరస్వతి, ద్వారపురెడ్డి జగదీశ్వరరావు, బుద్ధా నాగ జగదీశ్వరరావుల పదవీకాలం ముగిసింది. ఇటీవల మండలి ఛైర్మన్ షరీఫ్ రాజీనామా చేశారు.మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి బీజేపీలో చేరడం, చదిపిరాల శివనాథ్ రెడ్డి పార్టీకు దూరం కావడంతో టీడీపీ బలం 15కు తగ్గింది.
మండలిలో ప్రస్తుతం వైసీపీ(YSRCP) బలం 18గా ఉంది. కొద్దిరోజుల క్రితమే టీచర్ ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్పలత, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, టీడీపీకు దూరంగా ఉన్న శివనాథ్ రెడ్డిలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు మద్దతివ్వడంలో 21కు చేరింది.ఇవికాకుండా ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటాలో 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇవి కూడా వైసీపీ పూర్తిగా గెల్చుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కరోనా కారణంగా ప్రస్తుతానికి ఈ ఎన్నిక వాయిదా పడింది. రానున్న రోజుల్లో మండలి(Legislative Council) పూర్తిగా వైసీపీ ఆధిక్యంలో వెళ్లనుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రస్తుతం ఉన్న 21 మంది సభ్యులకు తోడు అదనంగా మరో 11 మంది చేరనున్నారు.
Also read: Anandaiah mandu: ఆనందయ్య మందు పంపిణీపై MP Vijayasai Reddy ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook