YSRCP Leader Siromundanam: ఎమ్మెల్యే బొండా ఉమా కక్ష సాధింపు.. గుండు కొట్టించుకున్న వైసీపీ నేత

YSRCP Leader Siromundanam in Vijayawada: వైసీపీ నందెపు జగదీష్ గుండు కొట్టించుకుని నిరసన తెలిపారు. ఎమ్మెల్యే బోండా ఉమా తన భవనాన్ని కూల్చివేయించారని ఆయన ఆరోపిస్తూ.. కూల్చిన భవనం ముందే కూర్చొని శిరోముండనం చేయించుకున్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Jun 17, 2024, 06:21 PM IST
YSRCP Leader Siromundanam: ఎమ్మెల్యే బొండా ఉమా కక్ష సాధింపు.. గుండు కొట్టించుకున్న వైసీపీ నేత

YSRCP Leader Siromundanam in Vijayawada: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కక్ష సాధింపులకు నిరసనగా వైసీపీ దళిత నేత నందెపు జగదీష్ శిరోముండనం చేయించుకున్నారు. తన స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా గుండా గిరి ప్రదర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేశానేనే కోపంతో అధికారులను ఉపయోగించి తనకు చెందిన భవనాన్ని జేసీబీతో కూల్చివేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మనస్థాపానికి గురైన జగదీష్.. కూల్చేసిన భవనం ముందు శిరోముండనం చేయించుకుని అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. గతంలో తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈ భవనం అప్పటి ఎమ్మెల్యే బోండా ఉమా ప్రారంభించారని.. తాను ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేశానని అసూయతో, అధికార మధంతో భవనాలను కుప్పకూల్చారని మండిపడ్డారు.

Also Read: Chandrababu naidu: ఐదేళ్లుగా శపథం.. చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింట్లో కాలు పెట్టిన మహిళ.. వీడియో వైరల్..

దీనిపై సీఎం చంద్రబాబు నాయుడికి స్పందనలో ఫిర్యాదు చేస్తానని జగదీష్ తెలిపారు. దళిత వైసీపీ నాయకుడిగా ఉండటం తాను చేసిన తప్పా..? అని ప్రశ్నించారు. బోండా ఉమాకు అధికారం తోడవడంతో ఇటువంటి అన్యాయాలు ముందు రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. తాను మాజీ కార్పొరేటర్, కో ఆప్షన్ మెంబర్ అని.. తకు న్యాయం జరగకపోతే తన కుటుంబ సభ్యులకి శిరోముండనం చేసుకుని నిరసన తీవ్రతరం చేస్తానని స్పష్టం చేశారు. తనకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదన్నారు. 

"నాకు ఈ అవమానం జరుగుతుందని కేశినే నానికి ఫోన్ చేస్తే ఎత్తలేదు. పారిపోయాడు. వెల్లంపల్లికి ఫోన్ చేస్తే.. ఆఫీస్‌ తీసేశారు. బొండా ఉమామహేశ్వరరావుకు ఒక్కటే చెబుతున్నా. నేను నీకు ఏం అన్యాయం చేశా. బొండా ఉమా నువ్వు శునకానందం పొందు. ఏం పర్వాలేదు. ఇదే బొండా ఉమా స్లాబ్ వేయించారు. ఆయనే కూల్చేయించారు. భగవంతుడు ఉన్నాడు. నేను న్యాయ దీక్ష చేస్తా. వారానికి ఒకసారి, నెలకు ఒకసారి ఇలా శిరోముండనం చేయించుకుంటాం. ఈ డాక్యుమెంట్లను చంద్రబాబు నాయుడికి చూపిస్తా.." అని జగదీష్ అన్నారు. 

Also Read: Chandrababu naidu: ఐదేళ్లుగా శపథం.. చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింట్లో కాలు పెట్టిన మహిళ.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News