AP Politics: వైసీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ ఎంపీపీలతో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దిశా నిర్దేశం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎవరూ చేయని సంక్షేమ పధకాల్ని వైఎస్ జగన్ చేశారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో ఎన్నికలెప్పుడొచ్చినా వైసీపీ క్లీన్‌స్వీప్ చేస్తుందని స్పష్టం చేశారు. గత ఐదేళ్ల హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలతో ప్రజల్లో ఇంకా చెక్కుచెదరని అభిమానం ఉందని తెలిపారు. తమ హయాంలో చేసిన మంచి పనులు ఇంకా ప్రజల్లో ఉన్నాయని చెప్పుకొచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అందరికీ అందుబాటులో ఉండే పార్టీ అని తెలిపారు. ఇది ముమ్మాటికీ అభిమానులతో, అందరి అభిప్రాయాలు తీసుకుని నడిచే పార్టీ అని చెప్పారు. ఎన్నో సంక్షేమ పధకాలు అమలు చేసినా ఓడిపోవడానికి కారణమేంటనే చర్చ ప్రజల్లో ఉందన్నారు. రాష్ట్రంలోప్రతిపక్షం, వైసీపీ లేకుండా చేయాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారన్నారు. అందరూ కలసికట్టుగా నిలబడాల్సిన సమయం వచ్చిందన్నారు.
2019లో అధికారం కోల్పోయిన తరువాత చంద్రబాబు రెండు మూడేళ్లు అసలు కనబడలేదని గుర్తు చేశారు. కానీ తాము మాత్రం ఎప్పుడూ జనంలోనే ఉంటున్నామన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో దోపిడీలు చేసేందుకు మళ్లీ జన్మభూమి కమిటీలు వచ్చాయన్నారు. ప్రశ్నిస్తే చాలు అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఆఖరికి తిరుపతి లడ్డూపై కూడా రాద్ధాంతం చేశారన్నారు.
Also read: Interest Free Loan: మహిళలకు కేంద్రం గుడ్‌న్యూస్, 5 లక్షల వడ్డీ రహిత రుణాలు, ఎలాగంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.