YSRCP MP Nandigam Suresh : నాకు ఏమైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత : ఎంపీ నందిగం సురేష్

రాజధాని అమరావతి రథ మహోత్సవంకు వెళ్లి వస్తుంటే కొంతమంది తనపై దాడికి పాల్పడ్డారని.. అది టీడీపి పెయిడ్ ఆర్టిస్టుల పనేనని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. జై అమరావతి.. జై చంద్రబాబు.. అంటూ తనపై దాడి చేయడమే కాకుండా తనను నోటికొచ్చినట్లుగా దూషించారని ఎంపీ సురేష్ ఆవేదన వ్యక్తంచేశారు.

Last Updated : Feb 24, 2020, 09:18 PM IST
YSRCP MP Nandigam Suresh : నాకు ఏమైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత : ఎంపీ నందిగం సురేష్

అమరావతి: రాజధాని అమరావతి రథ మహోత్సవంకు వెళ్లి వస్తుంటే కొంతమంది తనపై దాడికి పాల్పడ్డారని.. అది టీడీపి పెయిడ్ ఆర్టిస్టుల పనేనని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. జై అమరావతి.. జై చంద్రబాబు.. అంటూ తనపై దాడి చేయడమే కాకుండా తనను నోటికొచ్చినట్లుగా దూషించారు. లేమళ్ల దగ్గర నాపై టీడీపీ మహిళ కార్యకర్తలు జేఏసీ ముసుగులో దాడి చేశారు. అంతటితో ఆగని ఆ మహిళలు.. ఏం పీకుతారంటూ ఎంపీ అని కూడా చూడకుండా నోటి కొచ్చినట్లు నానా దుర్భాషలాడుతూ కళ్ళలో కారం చల్లారని ఎంపీ సురేష్ ఆవేదన వ్యక్తంచేశారు. 

తనపై దాడి జరగడం ఇదేం తొలిసారి కాదని.. గతంలోనూ కొందరు తనపై దాడికి పాల్పడ్డారని ఎంపీ సురేష్ తెలిపారు. తన వ్యక్తిగత సహాయకుడిపైనా చెప్పుతో దాడి చేశారు. తన పక్కనే ఉన్న వ్యక్తిని కాలర్ పట్టుకొని కొట్టారని ఎంపీ సురేష్ పేర్కొన్నారు. తమపై దాడి చేసిన వారికి.. రాజధాని అమరావతికి ఏ సంభంధం లేదని.. దాడిలో పాల్గొన్న వాళ్లంతా టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులేనని ఆయన మండిపడ్డారు. 'మేము మా సామాజిక వర్గం మాత్రేమే రాజ్యాధికారం చేయాలి.. దళితులు ఎప్పుడు ఊరు బైట ఉండలి' అని భావించే చరిత్ర చంద్రబాబుది. ''అందుకే నన్ను అంతం చేయాలని ఆయన కుట్రపన్నుతున్నారు. నాకు ఏమైనా జరిగితే.. అందుకు చంద్రబాబే బాధ్యత వహించాల్సి ఉంటుంది'' అని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ టీడీపీ అధినేత చంద్రబాబును హెచ్చరించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News