Parliament Monsoon Sessions: వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ, సభ్యులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం

Parliament Monsoon Sessions: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపధ్యంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ ప్రారంభమైంది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 15, 2021, 12:34 PM IST
Parliament Monsoon Sessions: వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ, సభ్యులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం

Parliament Monsoon Sessions: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపధ్యంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ ప్రారంభమైంది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Sessions)జూలై 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల భేటీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రారంభమైంది. లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు భేటీకు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ ఆనుసరించాల్సిన వ్యూహం,పెండింగ్‌లోని సమస్యలపై చర్చించాల్సిన తీరుపై పార్టీ అధినేత వైఎస్ జగన్(Ys jagan) సభ్యులకు దిశా నిర్దేశం చేయనున్నారు. కృష్ణా జలాల వివాదం, విశాఖ స్టీల్‌ప్లాంట్ అంశం, ఏపీకు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల్సిన నిధుల విషయమై పార్లమెంట్‌లో ప్రస్తావించనున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇటీవల జల వివాదం చోటుచేసుకుంది. ఇప్పటికే ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులకు ఏపీ ప్రభుత్వం ఈ విషయమై లేఖ రాసింది. మరోవైపు వైసీపీ బహిష్కృత ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంపై కూడా స్పీకర్‌పై వైసీపీ ఒత్తిడి తీసుకురానుంది. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ(Visakha steelplant issue)కు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో స్వరం విన్పించనున్నారు. ప్రైవేటీకరణ కాకుండా ప్రత్యామ్నాయమార్గాలపై దృష్టి సారించాలని కేంద్రాన్ని కోరనున్నారు.

Also read: Vijayawada Airport Runway: రాష్ట్రంలోనే అతిపెద్ద రన్‌వేగా విజయవాడ ఎయిర్‌పోర్ట్ , ఇవాళ్టి నుంచి ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News