Adani Coal Contract: ఏపీలో అదానీకు మరో భారీ కాంట్రాక్ట్ చిక్కింది. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రానికి అవసరమైన బొగ్గు విదేశీ బొగ్గును జెన్‌కోకు సరఫరా చేసే ఒప్పందం ఇది. మరో 4 సంస్థలతో పోటీపడి రివర్స్ టెండరింగ్‌లో అదానీ టెండర్ హస్తగతం చేసుకుంది. ఆ వివరాలు మీ కోసం..
కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గు అవసరముంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆ దేశాల్లో బొగ్గుకు డిమాండ్ పెరగడంతో విదేశీ బొగ్గు ధర పెరిగింది. గతంలో టన్ను బొగ్గు 7 వేలుంటే ఇప్పుడు 10-11 వేల వరకూ పలుకుతోంది. దేశీయంగా మాత్రం బొగ్గు టన్ను 5 వేలకే లభిస్తోంది. ఇప్పుడు జెన్‌కో పిలిచిన టెండర్‌ను టన్నుకు 13 వేల 100 రూపాయలకు అదానీ సంస్థ కోట్ చేసింది. ఇతర సంస్థలు చెట్టినాడ్, ఎంబీఎస్, తరుణ్, ఆది సంస్థలు పోటీపడినా..అందరికంటే తక్కువ కోట్ చేసింది అదానీ కంపెనీ కావడంతో..రివర్స్ టెండరింగ్‌లో కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఇదే జెన్‌కో దేశీయంగా టన్ను బొగ్గును 5 వేలకు కొనుగోలు చేస్తోంది. విదేశీ బొగ్గు టన్నుకు 9వేలకు మించి కొనుగోలు చేస్తే భారమని తెలిసినా..అదానీ కంపెనీకు ఆ కాంట్రాక్ట్ అప్పజెప్పడంపై విమర్శలు వస్తున్నాయి.
వాస్తవానికి దేశీయంగా బొగ్గుకు కొరత ఉండటంతో విద్యుత్ ఉత్పత్తి సంస్థలు మరో 9 నెలలు సర్దుబాటు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించడంతో ఏపీ జెన్‌కో 10 లక్షల టన్నుల బొగ్గు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. గతంలో రెండుసార్లు విదేశీ బొగ్గుకు టెండర్లు పిలవగా టన్నుకు అత్యధికంగా 18 వేలు బిడ్స్ దాఖలు కావడంతో ఆ టెండర్లనే జెన్‌కో రద్దు చేసుకుంది.
కృష్ణపట్నంలో 800 మెగావాట్ల సామర్ధ్యంతో ఉన్న మూడవ యూనిట్‌ను వాణిజ్య ఉత్పత్తి పరిధిలో తీసుకొస్తోంది జెన్‌కో. అందుకు తగ్గ బొగ్గు నిల్వలు లేకపోవడంతో విదేశీ బొగ్గు కొనుగోలుకు జెన్‌కో టెండర్లు పిలిచింది. ప్రస్తుతం విదేశీ బొగ్గు అంటే ఇండోనేషియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, మలేషియా మార్కెట్ల నుంచి భారీగా బొగ్గు దిగుమతి అవుతోంది.
జెన్‌కోతో అదానీ సంస్థకు కుదిరిన విదేశీ బొగ్గు ఒప్పందం విలువ అక్షరాలా 7.50 లక్షల కోట్లు. టన్నుకు 13 వేల 100 రూపాయలకు జెన్‌కో అదానీ నుంచి కొనుగోలు చేస్తుంది. రవాణా ఖర్చులు, పోర్టు హ్యాండ్లింగ్ ఛార్జీలు అన్నీ అదానీ సంస్థనే భరించాలి.
Also read: Nita Ambani's Make-up Man Salary: నీతా అంబాని మేకప్ మేన్ జీతం ఎంతో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook