Amazon Prime: యువతకు అమెజాన్ గుడ్‌న్యూస్, ప్రైమ్ వీడియా మెంబర్ షిప్‌పై 50 శాతం తగ్గింపు

Amazon Prime: ప్రస్తుతం ఓటీటీ క్రేజ్ పెరుగుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న ఓటీటీ మార్కెట్‌లో వాటా పెంచుకునేందుకు ఓటీటీ వేదికలు వివిధ రకాల ఆఫర్లు, ప్రకటనలు చేస్తుంటాయి. అమెజాన్ ప్రైమ్ అదే పని చేస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 4, 2023, 11:27 PM IST
Amazon Prime: యువతకు అమెజాన్ గుడ్‌న్యూస్, ప్రైమ్ వీడియా మెంబర్ షిప్‌పై 50 శాతం తగ్గింపు

Amazon Prime: కరోనా సంక్షోభ సమయం నుంచి ఓటీటీలకు ఆదరణ పెరిగింది. ఆ తరువాత ఓటీటీ అనేది ప్రజలకు అలవాటుగా మారడం ప్రారంభమైంది. కొన్నిరోజులకు కేబుల్ కనెక్షన్ ఎంత సహజమో అలా అయినా ఆశ్యర్యం అవసరం లేదు. పోటీ తట్టుకునేందుకు మార్కెట్ పెంచుకునేందుకు ఓటీటీలు వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తుంటాయి.

దేశంలో ఎన్నో రకాల ఓటీటీ వేదికలున్నాయి. ఇటీవల కొద్దికాలంగా థియేటర్లతో సమానంగా భారీ బడ్జెట్ సినిమాలు ఓటీటీల్లో విడుదలవుతున్నాయంటే వాటికున్న క్రేజ్, డిమాండ్ ఏపాటిదో అర్ధమౌతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో సోనీలివ్, ఆహా, జీ 5, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా వంటి ఓటీటీ వేదికలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్ మరింత పెంచుకునేందుకు, కొత్త యూజర్లను ఆకట్టుుకునేందుకు అమెజాన్ ప్రైమ్ సరికొత్త ఆఫర్ అందిస్తోంది. ఇందులో భాగంగానే ఈ కామర్స్ వేదికను కూడా కలిగిన అమెజాన్ 2023 ప్రైమ్ డే సేల్ జూలై 15, 16 తేదీల్లో జరగనుంది. ఈ ప్రత్యేక సేల్‌లో వివిధ రకాల ఉత్పత్తులు, వస్తువులపై భారీగా డిస్కౌంట్ ఉంటుంది. 

అంతకంటే ముందు యువతను ఆకర్షించేందుకు 18-24 ఏళ్ల వయస్సు యువతకు అమెజాన్ యూత్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ప్రకారం సబ్‌స్క్రిప్షన్‌ను 50 శాతం తగ్గించేసింది అమెజాన్. కేవలం ఒక ప్లాన్‌లోనే కాకుండా మంత్లీ, ఇయర్ లీ ప్లాన్స్‌పై ఈ డిస్కౌంట్స్ అందుతున్నాయి. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ నెల సబ్‌స్క్రిప్షన్ 299 రూపాయలు కాగా 150 రూపాయలు క్యాష్‌బ్యాక్ రూపంలో వెనక్కి వస్తుంది. ఇక ఏడాది ప్లాన్ 1499 రూపాయలు కాగా క్యాష్ బ్యాక్ రూపంలో 750 రూపాయలు వెనక్కి వచ్చేస్తాయి. క50 శాతం క్యాష్ బ్యాక్ నగదును నేరుగా మీ బ్యాంక్ ఎక్కౌంట్లకు కాకుండా అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో వెనక్కి వస్తుంది. దీనికోసం అమెజాన్ యాప్ ఓపెన్ చేశాక అందులో యూత్ ఆఫర్ ట్యాబ్ క్లిక్ చేయాలి. ప్రైమ్ మెంబర్‌షిప్ ప్లాన్ కొనుగోలు చేసేటప్పుడు మీ వయస్సును అందులో ధృవీకరించాలి.

Also read: Kia Seltos Facelift: కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ, అత్యాధునిక ADAS ఫీచర్లతో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News