Apache Rtr 310 Launch Date In India: మార్కెట్లోని బైక్ రైడర్లను దృష్టిలో పెట్టుకొని టీవీఎస్ మోటార్స్ మరో స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేయబోతున్నట్లు వెల్లడించింది. ఇది ఇంతకుముందున్న Apache పేరుతో త్వరలో రాబోతోంది. ఇది 310 cc ఇంజన్ తో రోడ్లపై పరుగులు పెట్టబోతోంది. ఈ స్పోర్ట్స్ బైక్ హోండా CB300R, KTM 390 డ్యూక్, బజాజ్ డొమినార్ 400, BMW G 310R వంటి బైక్‌లతో పోటీపడుతుంది. కంపెనీ ఈ బైక్ లాంచింగ్ డేట్ వివరాలను మాత్రం ఇప్పటికీ వెల్లడించలేదు. కానీ కొంతమంది యూట్యూబర్లు ఈ బైకు సంబంధించిన ఫోటోలను లీక్ చేసినట్లు సమాచారం. ఈ బైక్ లో లభించబోతున్న ఫీచర్ లేనిటో? మైలేజీ సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
డిజైన్, ఫీచర్లు:
కొత్త నేకెడ్ అపాచీ RTR 310 స్ట్రీట్‌ఫైటర్‌ను కంపెనీ స్పోర్ట్స్ బైక్ గా డిజైన్ చేసింది. అయితే ఈ అపాచీ బైక్ కి సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి. అయినా ఫోటోలు చూస్తే..ఈ బైక్ సన్నని ఫ్రంట్ ఫోర్క్ ట్యూబ్, కొత్త ఎల్‌ఈడీ లైట్లు, కొత్త అల్లాయ్ వీల్స్, సీట్, డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది. ఈ ఫొటోస్ లో డ్యూయల్ టోన్ బ్లాక్, గోల్డ్‌లో పెయింట్ ను కలిగి ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా కొత్త టీవీఎస్ బైక్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తుందని లీకైన ఫోటోలు ద్వారా తెలుస్తోంది.
Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా
ఇంజన్ ఫీచర్స్:
కొత్త అపాచీ RTR 310, RR310 మోడల్స్ 310cc సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ కలిగి ఉంటుందని సమాచారం.ఇది 34bhp పవర్ తో 28Nm టార్క్‌ను ఉత్పత్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది.
హోండా CB300Rతో పోటీ పడనున్న అపాచీ RTR 310:
ప్రముఖ మోటార్స్ సైకిల్ కంపెనీ అయినా హోండా విడుదల చేసిన CB300R తో పోటీ అపాచీ RTR 310 పోటీ పడబోతున్నట్లు తెలుస్తోంది. హోండా CB300R బైక్ 286 cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్, డబుల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్‌తో మార్కెట్లో ఇతర బైకులకు గట్టి పోటీని ఇస్తుంది. ఈ ఇంజన్ 30.45PS పవర్ తో 27.5Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook