Apple Days Sale: ఐఫోన్ 16, ఐఫోన్ 15, మ్యాక్‌బుక్స్‌పై ఊహించని డిస్కౌంట్

Apple Days Sale: ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. కొత్త సంవత్సరం వేళ ఆపిల్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. ఆపిల్ డేస్ సేల్‌లో మీరు నమ్మశక్యం కాని ధరలకు ఐఫోన్ 16 సహా ఇతర ఉత్పత్తులు పొందవచ్చు. ఆ వివరాలు మీ కోసం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 1, 2025, 07:09 PM IST
Apple Days Sale: ఐఫోన్ 16, ఐఫోన్ 15, మ్యాక్‌బుక్స్‌పై ఊహించని డిస్కౌంట్

Apple Days Sale: కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా ఆపిల్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఆపిల్ ఉత్పత్తులైన ఐఫోన్, ఎయిర్ పోడ్స్, మ్యాక్‌బుక్స్‌పై భారీ డిస్కౌంట్ లభించనుంది. ఐఫోన్ 13, ఐపోన్ 14, ఐఫోన్ 15, ఐఫోన్ 16సిరీస్ ఫోన్లతో పాటు ఆపిల్ స్మార్ట్ వాచెస్‌పై కూడా ఊహించని డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఆ వివరాలు తెలుసుకుందాం.

ఆపిల్ డేస్ సేల్ డిసెంబర్ 29న ప్రారంభమైంది. జనవరి 5 వరకూ అంటే మరో నాలుగు రోజులు నడుస్తుంది. విజయ్ సేల్స్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఐఫోన్ గ్రేట్ డీల్స్ అందుబాటులో ఉండనున్నాయి. ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 15, ఐఫోన్ 16తో పాటు మ్యాక్‌బుక్, ఆపిల్ వాచ్‌సిరీస్ 10, ఆపిల్ ఎయిర్ పోడ్స్ 4 ఈ సేల్‌లో ఉన్నాయి. ఆపిల్ కంపెనీ డిస్కౌంట్ ఆఫర్ కాకుండా బ్యాంక్ ఆఫర్లు కూడా వర్తిస్తాయి. 

ఐఫోన్ 16 అయితే 66,900 రూపాయలు కాగా, ఐఫోన్ 16 ప్లస్ 75,490 రూపాయలుగా ఉంది. రెండింటిపై ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ 4 వేల రూపాయలు లభించనుంది. ఐఫోన్ 16 ప్రో అయితే 1,03,900 కాగా ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర 1,27,650 రూపాయలుగా ఉంది. ఈ రెండింటిపై 3 వేల రూపాయలు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఐఫోన్ 15 ధర 57,490 రూపాయలు, ఐఫోన్ 15 ప్లస్ ధర 66,300 రూపాయలుంటుంది. వీటిపై కూడా ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ 3 వేలుంటుంది. ఐఫోన్ 14 ప్రారంభధర 48,990 రూపాయలు కాగా బ్యాంక్ డిస్కౌంట్ 1000 రూపాయలుంటుంది. ఐఫోన్ 13 అయితే కేవలం 42,900 రూపాయలకే లభించనుంది. మరో 1000 రూపాయలు బ్యాంక్ డిస్కౌంట్ లభించనుంది.

ఇక ఐప్యాడ్ 10వ జనరేషన్ కేవలం 29,499 రూపాయలకే కొనవచ్చు. ఐప్యాడ్ ఎయిర్ అయితే 50,499 రూపాయలకు లభిస్తుంది. ఇక మ్యాక్‌బుక్ ఎయిర్, మ్యాక్‌బుక్ ప్రో, ఆపిల్ వాచ్ సిరీస్ 10పై ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లభించనుంది. ఆపిల్ ఉత్పత్తులు కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి అవకాశం. కొత్త సంవత్సరంలో ఐఫోన్ సహా ఆపిల్ ఉత్పత్తులు కొనేందుకు బెస్ట్ టైమ్ ఇదే. 

Also read: Land Charges: ఏపీలో మరో బాదుడు కార్యక్రమం, భారీగా పెరగనున్న ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News